Friday, March 30, 2012

ఆ సంతోషాన్ని కరిగించకు...



నీ సొంతమైన నా మనసు
నీ రాకకై ఎదురు చూస్తోంది...
నీ కాంతి పడని నా మోము
చీకటితో పోరాడుతోంది...


నీ నవ్వు వికసించిన క్షణం
నా మనసు పులకించింది...
నిన్ను తాకిన గాలి తగిలి
అది శ్రుతి తప్పింది...


రంగుల కలలాంటి నా జీవితం
చిమ్మచీకటిలో మెలకువ తెప్పిస్తోంది...
నీవు లేని లోకం అదేనంటూ 
                     నిద్రను తప్పిస్తోంది...


ఒడుదుడుకులతో నిండిన జీవితం 
నిన్ను చూసాక సాఫీగా సాగుతోంది...
ఆ సంతోషాన్ని కరిగించకు...
నన్ను మళ్లీ 
ఆ ముళ్ళ బాటలో తోయకు...

No comments:

Post a Comment