Monday, March 19, 2012

నీ మాట వినాలని...




నీ చిరునవ్వు సందడి నా మనసుకు ఆనందం...


నీ చెంత ఉండాలని 
         నా మనసు పరుగు తీస్తోంది..
నీ మాట వినాలని 
         నా చెవి ఎదురు చూస్తోంది...


నీ జాబుకై నా నిరీక్షణ..
నీ మనసుకై నా వీక్షణ..


నీ ఊసులలో ప్రతిరోజూ ప్రత్యేకం...


ఈ ప్రత్యేకత నిరంతరం నిలవాలి...
నీ మనసు నాతో కలవాలి...


నాకు సమయం సహకరించదు..
మనసు బాధ విన్నవించదు..


ఇది తాళలేను, నిను వీడ లేను
నా ఈ బాధని కరిగిస్తావని చిన్ని ఆశ
ప్రేమను కురిపిస్తావని అభిలాష...

No comments:

Post a Comment