గులాబీ లాంటి నీ మనసు
నా మనసుని లాగుతూ ఉంది
దరిచేరిన మరుక్షణం
ముళ్ళతో పోడిచివేస్తోంది
మభ్యపెట్టే మాయలో ముంచివేసావు
మాయమయి గుండెలో మంటరేపావు
నదిలో ప్రవాహానివై
ఎదురీతకు అడ్డుపడుతున్నావు
మాటలతో మంత్రమేసావు
గుట్టుగా మనసునే చీల్చివేసావు
నీకై సాగే పయనం
నిన్నే చేరుకోవాలి...
నీ ఆలోచనలతో సాగే జీవితం
నీ తోడుతో అంతమవ్వాలి...
No comments:
Post a Comment