Tuesday, March 20, 2012

వాన చినుకై నన్ను చేరి...



నిన్ను చూసే వేళలోనా
                   నేను ఒక నడినావ...
సంద్రమంతా నిండి ఉన్న
                  రూపమే నీదేగా...


వాన చినుకై నన్ను చేరి 
                  నిలువునా తడిపావే...
క్షణములోనే దరిన చేర్చి 
                  మరు క్షణము విడిచావే...
లోకమంతా ఏల ఉన్న 
                  నువ్వు-నేనూ ఒకటేలే...
జీవితానా ప్రేమ ఒకటే 
                  ఇరువురిని కలుపునులే...


నీ కొరకు నేనున్నా...
నా దరికి చేరేనా...
నీ మనసు నాదైన...
ఈ క్షణము వదిలేనా...


ఈ కవితల వల్లరి నీ కోసం...
నా జీవిత గమ్యం నీకోసం...


నీ కరుణ నాపై కురిపిస్తావని..
నీ మనసు నాకై అందిస్తావని...
కోరుకుంటూ


--నా నీ ప్రేమ--

No comments:

Post a Comment