Friday, March 16, 2012

నీకై ఎదురుచూపు





నీ రాకతోనే, నా మది వెలుగు చూసింది
నీ ఎడబాటు లోనే అది కరిగిపోతోంది
నీ మది తెలిపే సమాధానానికై
నా మది ప్రశ్నై ఎదురు చూస్తోంది...
నీ మది,
నీడలా నా తోడు అంటూ, నిజం కాదని వెక్కిరిస్తోంది...


నీ ఎడబాటు, నాకు తడబాటు
నీ శాపం, నాకు వరం
నీ కోపం, నాకు తాపం
నీ దుఃఖం, నాకు దుఃఖం
నీ సంతోషం, నాకు సర్వస్వం 


నీకై ఎదురుచూపు, నాకు ఓ తీపి జ్ఞాపకం
ఆ జ్ఞాపకాలతో  నీ ప్రేమకై ఎదురుచూస్తూ...


నా ప్రేమ... 



No comments:

Post a Comment