నా వలపు తలపులలో..
నీకై కలవరింత...
నా మనసు లోతులలో
నీకై ఏదో చింత...
ఎందుకనే ప్రశ్న ఊగుతూ ఉంది
ఏమో అనే సమాధానం
ఎదురుపడుతోంది...
ఒక్క క్షణం నీవు లేని లోకం
నాకు శూన్యం...
తెలిసి కూడా చేయవెందుకు నాకు న్యాయం..?
జీవితాంతం ఎదురుచూపు...
భరించలేదు నా మనసు...
దిక్కు తోచని దారిలో ఎన్నాళ్ళిలా..?
అంతుతోచని ప్రేమకై నిరీక్షణేల ..?
నీవు లేని జీవితం నాకు భారం...
నీవు రాని బ్రతుకు నాకు వ్యర్ధం...
No comments:
Post a Comment