నిన్ను తలచు క్షణమే
పూవు లాంటి మనసు
ముళ్ళ బాటను తడిమి
బాధపడుతూ ఉంది...
ఎందుకైనా మనసా...
దూరమైనది తెలుసా...
క్షణము క్షణము నీకై...
వెతికి అలసి పోయా...
మనసు లోని మాటలన్ని
మాలలోని పూవులైన...
వాటి వలన కలుగు బాధ
దారమల్లె దాగి ఉంది...
ఒంటరైన మనసు తోడు కోరుతోంది...
నీ మనసు కోసం అది వెదుకులాడుతోంది...
కలను సైతం కరిగింపజేస్తోంది సమయం...
నిజము సైతం మరిపింపజేస్తోంది ప్రణయం...
మరచిపోయిన నిజం లేదు...
కరిగిపోయిన కాలం రాదు...
ఏ నాటికైనా నిన్ను చేరాలనే ఆశతో
--నా నీ ప్రేమ--
No comments:
Post a Comment