Friday, March 30, 2012

ఆ సంతోషాన్ని కరిగించకు...



నీ సొంతమైన నా మనసు
నీ రాకకై ఎదురు చూస్తోంది...
నీ కాంతి పడని నా మోము
చీకటితో పోరాడుతోంది...


నీ నవ్వు వికసించిన క్షణం
నా మనసు పులకించింది...
నిన్ను తాకిన గాలి తగిలి
అది శ్రుతి తప్పింది...


రంగుల కలలాంటి నా జీవితం
చిమ్మచీకటిలో మెలకువ తెప్పిస్తోంది...
నీవు లేని లోకం అదేనంటూ 
                     నిద్రను తప్పిస్తోంది...


ఒడుదుడుకులతో నిండిన జీవితం 
నిన్ను చూసాక సాఫీగా సాగుతోంది...
ఆ సంతోషాన్ని కరిగించకు...
నన్ను మళ్లీ 
ఆ ముళ్ళ బాటలో తోయకు...

Thursday, March 29, 2012

నా దుఃఖాన్ని తుడిచే చేయి...


నేను కోరేది నీ తోడ్పాటు...
తగ్గించు ఈ ఎడబాటు...
మన్నించు నా పొరపాటు...
కడవరకు సాగు నాతోపాటు...

నా దుఃఖాన్ని తుడిచే చేయి
                        నీదవ్వాలని నా కోరిక...
నే సాగే మార్గంలో నీవు 
                        నా నీడవ్వాలని నా ఆశిక...

నా కన్నీటి సాగరం నన్ను ముంచేలోగా
ఒడ్డున చేరుస్తావని ఎదురు చూస్తున్నా...
నా జీవిత గమ్యం నీవని చూపే
కల కోసం కన్ను మూస్తున్నా...

నీవు నన్ను చేరిన క్షణం
నన్ను నేను మరచాను...
ఇక నిన్ను మరువలేను...
నిన్ను వీడి బ్రతుకలేను...

నీవు లేక నేను
పచ్చటి చిగురుటాకులు లేని మోడైపోతున్నా...
ప్రవాహం లేని నదిలా కుమిలిపోతున్నా...

నా జీవితంలో పచ్చదనం నింపి
నాలో ఒక ప్రవాహాన్ని పుట్టించే తోడు
నీవని వేచి చూస్తున్నా...
వేయి కన్నులతో ఎదురు చూస్తున్నా...


Wednesday, March 28, 2012

ఎందుకు మారిపోయావు...?



గుండెల్లో ఎన్నెన్నో ఆశలు...
కళ్ళలో మాసిపోని బాసలు...
నిన్ను తలచే ఉచ్వాస నిశ్వాసలు...
నిన్ను చూపే నా ఊహలు...


నా అలుపెరుగని ప్రయాణం
                        నీ మది కోసమే పయనం...
నిన్ను చూసి సిగ్గుపడే నయనం
                        దరిచేరగానే చిన్నబోతోంది పాపం...


నీ లోకంలో నేనున్నాను...
కానీ నాకు నువ్వే లోకం...


నీకై సాగే నడక తడబాటు లో...
నీకై నే చేసే పొరపాటుల్లో...
నీ తొలకరి నవ్వు
సాగిపోమ్మంటూ ముందుకు తోస్తోంది...


నా ప్రేమ తెలిపిన క్షణంలో
నేను చూసిన నీవు
ఎందుకు మారిపోయావు...?
నన్నెందుకు మారమన్నావు...?

నిన్నెందుకు మర్చిపోమ్మన్నావు...?







Tuesday, March 27, 2012

ఎదురు చూసే కనుచూపులో...


ఎదురు చూసే కనుచూపులో 
                   లోకం చిన్నదై పోతోంది...
మనసు పలికే మాటలలో
                   కష్టం అంటూ క్రుంగిపోతోంది...


నీ మదే నా యదే కోరిన క్షణమే...
నా మదే నీ చూపుకై ఎదురు చూసే...
స్వప్నం చూపిన లోకం 
                    నిన్ను వీడమంటోంది ...
మనసు చంపుకొని 
                    నిన్ను మరువమంటోంది ...


ప్రాణం నీకై మిగిలి ఉన్నా...
మనసు మాత్రం మరణిస్తూంది...
ఎన్ని రోజులైనా ఎంత కాలమైన
మరిగే మనసు నిన్నే కోరుతూ ఉంది...


నే కను మూసే క్షణం 
నే చివరగా పలికే పదం
నీ నామధేయం...
అది నే చేసే చివరి పుణ్య కార్యం...

Monday, March 26, 2012

కనుమరుగయ్యే నా మనసు...


నిన్ను తలచే ప్రతిసారి ఏదో తెలియని చింత...
ఇక నిన్ను అసలు పొందలేనేమో అని జీవితమంతా ...

గడిచే నిమిషాల నడుమ
                   నీ తలపు నలిగిపోతోంది...
దానికైనా అర్హత లేదంటూ
                   నన్ను విడిచి వెళ్ళిపోతోంది...

కనుమరుగయ్యే నా మనసు
నీ తొలకరి నవ్వుకై 
                   ఎదురు చూస్తోంది...
హద్దులు చెరిపే నీ మనసు
అదే హద్దు దాటకంటూ ఆనతిస్తోంది...


కనులు వెతికే కలల మార్గం
నిజం కాదని తెలిసినా...
నిజానిజాల ప్రశ్న ఎత్తక 
కలల ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నాను...

ఈ బాధ నుండి విముక్తి కల్గిస్తావని ఆశిస్తూ

--నీకై నా ప్రేమ--

Sunday, March 25, 2012

తోడు లేని నా మనసు...



నీవు నా జీవితంలో లేకపోయినా...
నా మనసు నీకే అంకితం...
నా ప్రేమయొక్క ఏకైక లక్ష్యం నీ సంతోషం...


నీవు నన్ను చేరవని తెలుసు...
నీవు లేక నా మనసు ఉండలేదనీ తెలుసు...
ప్రతి క్షణం నీకై ఆలోచిస్తూ 
నిన్ను చూసిన క్షణం 
             నా మనసు మూగబోతోంది...
మాట్లాడలేనంటూ బెట్టు చేస్తోంది...


తోడు లేని నా మనసు
            ఒంటరై ఒరిగిపోతోంది...
నీవు లేని చోట 
            ఉండలేనంటూ కరిగిపోతోంది...


నా ఈ జీవితం నీ సంతోషానికే అంకితం...
నీకై పరితపించే మనసు
                         నిన్ను వీడనంటోంది... 
ప్రతిక్షణం నీ తోడు కోరుతోంది...
మరుక్షణం నీవు లేని చోట ఉండనంటోంది ...


నా ఈ దుఃఖం నీ జీవితానికి అడ్డు కాకూడదు...
అందుకే 
నీకు నా బాధ అంటనంత 
                        దూరాలకు వెళ్ళిపోతున్నాను...
సుధీర్గ లోకాలకు సాగిపోతున్నాను...  


--ఇట్లు నీకై నా ప్రేమ---

ఈ బాధ తాళలేనిది...



నాకు తెలియదు
నీ మనసు నాకు అందదని...
నాకు తెలియదు
నా మనసు ఒంటరి అవుతుందని...


నీవు మాట్లాడిన మొదటి క్షణం
ఏదో తెలియని 
            అలజడి మొదలైంది...
ఆ అలజడి వేడిలో నా మనసు 
నీ ఉత్తరానికై 
            నడక సాగించింది...


గడచిన కాలం
నాకు జ్ఞాపకాలని మిగిల్చింది...
నడిచే మౌనం 
నా మనసును బంధించింది...


నిజానిజాల సమరంలో
నిరాయుదుడిగా నిలిచిపోయాను...
తోడులేక నీకోసం నేలరాలాను...


ఈ నరకం భరించలేనిది...
ఈ బాధ తాళలేనిది...
  






Saturday, March 24, 2012

నిన్ను చేరే బాటలో...



అందమైన అబద్దాల నడుమ
నిజమై నలుగుతున్న నా మనసు
కలలు చూపే దారిలో 
                  కనుమరుగైపోతోంది...
నయనం కురిపించే వానలో 
                  తడిసిపోతోంది...

నిన్ను చేరే బాటలో 
                  రాళ్లు ఎన్ని తగిలినా...
నీకై వేసే అడుగులో 
                  ముళ్లు ఎన్ని  గుచ్చినా...


నీకై సాగే పయనం ఆగదు...
నీకై వేచే మనసు మాయదు...

నీ బాధ చూడలేను...
నా బాధ చెప్పలేను...
నిన్ను నే వీడలేను...
నీవు లేక బ్రతుకలేను...


నీ సంతోషానికై
నేనెంతటి బాధనైనా అనుభవిస్తాను...
తలపు లేక నీకోసం ప్రాణమిస్తాను...



నీ బదులు తెలుపని క్షణం...



నా రంగుల ప్రపంచం 
అవుతోంది తెలుపు నలుపుల సమ్మేళనం...
నిన్ను చూసి కలవరించే సమయం 
మనసు మొదలెడుతోంది నీకై పయనం...


కలగా కరిగిన నీవు
                   నా కంటికి వరం...
నిజమై నిలచిన నేను
                   మరువలేని జ్ఞాపకం...

నిత్యం నీకై పరితపిస్తూ...
నీ ఊసులనే ఊపిరిగా సేవిస్తూ...
నన్ను శాసించే మనసు 
నీకై తుది శ్వాస విడుస్తోంది...

నా సంతోషం నీవని తెలిపిన క్షణం
నీ బదులు తెలుపని క్షణం
నా మనసు నీదని చెప్పిన క్షణం
నీ మనసుకై ఎదురు చూసిన క్షణం

నా మనసు అనుభవించిన ఆ వేదన
నిన్ను చేరుకోలేకపోయినందుకు నే పడిన ఆవేదన...

నేనంతా నీవైనా
నా శోకం నిన్ను చేరనివ్వను...
నా మనసును బాధ చెప్పనివ్వను...

ఇట్లు
--మోడై మిగిలిన నా మనసు--

Wednesday, March 21, 2012

ఒంటరైన మనసు...



నిన్ను తలచు క్షణమే 
                 పూవు లాంటి మనసు
ముళ్ళ  బాటను తడిమి 
                 బాధపడుతూ ఉంది...


ఎందుకైనా మనసా...
                 దూరమైనది తెలుసా...
క్షణము క్షణము నీకై...
                 వెతికి అలసి పోయా...


మనసు లోని మాటలన్ని 
                మాలలోని పూవులైన...
వాటి వలన కలుగు బాధ
                దారమల్లె దాగి ఉంది...


ఒంటరైన మనసు తోడు కోరుతోంది...
నీ మనసు కోసం అది వెదుకులాడుతోంది...
కలను సైతం కరిగింపజేస్తోంది సమయం...
నిజము సైతం మరిపింపజేస్తోంది ప్రణయం...  


మరచిపోయిన నిజం లేదు...
కరిగిపోయిన కాలం రాదు...


ఏ నాటికైనా నిన్ను చేరాలనే ఆశతో 


--నా నీ ప్రేమ-- 

దిక్కు తోచని దారిలో ఎన్నాళ్ళిలా..?


నా వలపు తలపులలో..
                      నీకై కలవరింత...
నా మనసు లోతులలో
                      నీకై ఏదో చింత...


ఎందుకనే ప్రశ్న ఊగుతూ ఉంది
ఏమో అనే సమాధానం 
                      ఎదురుపడుతోంది...


ఒక్క క్షణం నీవు లేని లోకం 
                      నాకు శూన్యం...
తెలిసి కూడా చేయవెందుకు నాకు న్యాయం..?


జీవితాంతం ఎదురుచూపు...
భరించలేదు నా మనసు...


దిక్కు తోచని దారిలో ఎన్నాళ్ళిలా..?
అంతుతోచని ప్రేమకై నిరీక్షణేల ..?
నీవు లేని జీవితం నాకు భారం...
నీవు రాని బ్రతుకు నాకు వ్యర్ధం...

Tuesday, March 20, 2012

వాన చినుకై నన్ను చేరి...



నిన్ను చూసే వేళలోనా
                   నేను ఒక నడినావ...
సంద్రమంతా నిండి ఉన్న
                  రూపమే నీదేగా...


వాన చినుకై నన్ను చేరి 
                  నిలువునా తడిపావే...
క్షణములోనే దరిన చేర్చి 
                  మరు క్షణము విడిచావే...
లోకమంతా ఏల ఉన్న 
                  నువ్వు-నేనూ ఒకటేలే...
జీవితానా ప్రేమ ఒకటే 
                  ఇరువురిని కలుపునులే...


నీ కొరకు నేనున్నా...
నా దరికి చేరేనా...
నీ మనసు నాదైన...
ఈ క్షణము వదిలేనా...


ఈ కవితల వల్లరి నీ కోసం...
నా జీవిత గమ్యం నీకోసం...


నీ కరుణ నాపై కురిపిస్తావని..
నీ మనసు నాకై అందిస్తావని...
కోరుకుంటూ


--నా నీ ప్రేమ--

రోధిస్తుంది నా నయనం...


నా మనసు లోని ప్రేమ నీతో చెప్పాలనే నా తపన

నీవు నన్ను విడచు క్షణం
రోధిస్తుంది నా నయనం
నిత్యం నాతో ఉంటానని మాటివ్వమంటూ
నీ తోడుకై మొదలవుతోంది పయనం 

నన్ను నేను మరచాను
                   నీకై వెతికాను
ప్రేమ పక్షిలా విహరిస్తూ
                   అలసిపోయి నేలరాలాను

కాలాలు కరిగిపోతూ
దూరం ఎంతని ప్రశ్న వేస్తున్నాయి... 
సమాధానం లేని మనసు మూగబోతోంది
కాలం నాకోసం ఆగనంటూ కదిలిపోతోంది...

నన్ను కరుణించేదెపుడు...?
నాకు మనసిచ్చేదేపుడు...?
నీ ప్రేమకై వేచి ఉన్నా...
అందుకే మిగిలి ఉన్నా...


Monday, March 19, 2012

గులాబీ లాంటి నీ మనసు...



అంతుపట్టని మనసు ఆలోచిస్తోంది నీ కోసం

గులాబీ లాంటి నీ మనసు
నా మనసుని లాగుతూ ఉంది
దరిచేరిన మరుక్షణం
ముళ్ళతో పోడిచివేస్తోంది

మభ్యపెట్టే మాయలో ముంచివేసావు
           మాయమయి గుండెలో మంటరేపావు
నదిలో ప్రవాహానివై 
           ఎదురీతకు అడ్డుపడుతున్నావు

మాటలతో మంత్రమేసావు
గుట్టుగా మనసునే చీల్చివేసావు

నీకై సాగే పయనం 
నిన్నే చేరుకోవాలి...
నీ ఆలోచనలతో సాగే జీవితం
నీ తోడుతో అంతమవ్వాలి...



నీ మాట వినాలని...




నీ చిరునవ్వు సందడి నా మనసుకు ఆనందం...


నీ చెంత ఉండాలని 
         నా మనసు పరుగు తీస్తోంది..
నీ మాట వినాలని 
         నా చెవి ఎదురు చూస్తోంది...


నీ జాబుకై నా నిరీక్షణ..
నీ మనసుకై నా వీక్షణ..


నీ ఊసులలో ప్రతిరోజూ ప్రత్యేకం...


ఈ ప్రత్యేకత నిరంతరం నిలవాలి...
నీ మనసు నాతో కలవాలి...


నాకు సమయం సహకరించదు..
మనసు బాధ విన్నవించదు..


ఇది తాళలేను, నిను వీడ లేను
నా ఈ బాధని కరిగిస్తావని చిన్ని ఆశ
ప్రేమను కురిపిస్తావని అభిలాష...

Sunday, March 18, 2012

నీవు వేసిన శిక్ష...



నేను చేసే తపస్సు , పొందాలనే నీ మనసు ...
తరిగి పోనంది దూరం...
                కరిగి పోతోంది కాలం...
నిన్ను చేరాలనే ఆశతో
                నిన్ను చూడాలనే ఘోషతో


నీవు వేసిన శిక్ష గాయపెడుతోంది...
గాయపడిన మనసు బాధపడుతోంది...


కలనైనా...నిజమైనా...
నీ కొరకే నా శ్వాస
నీ పైనే నా ఆశ...


నా ఆనందం నీవే
              నా ఆవేదన నీవే...
నా ఆలోచన నీవే
              నా ఆచరణ నీకే...


ప్రతినిత్యం నీ యోచనలతో నీ ఊహలతో
నీకై ఈ నిరీక్షణ నా ప్రేమతో...



నన్ను చూపే దర్పణాలు



నీ ఊహల మకరందం 
        నాకు తరగని ఆనందం...
నీ చేష్టల ఉత్తేజం
        నా కలలకు ఆకారం...


నా ఊహకు హద్దు లేదు
నా ప్రేమ కు భాష లేదు
కలం కరిగిపోతోంది
దూరం పెరిగిపోతోంది


వ్యతిరేకించే ఉద్దేశ్యాల నడుమ 
                                  నలిగిపోతోంది నా మనసు...
నిర్ధారణ లేక వేయలేకపోతోంది ముందడుగు...


నన్ను చూపే దర్పణాలు నిన్ను చూపుతున్నాయి
నేను అంటూ లేను అంటూ
నీవు వుంటే నిజం అంటూ ఏడిపిస్తున్నాయి


భరించలేని ఈ వేదన ఇంకెన్నినాళ్ళో..?
నిన్ను చూపే నిజం కోసం వేచిచూస్తున్నా...

ప్రేమ పంచి కరుణ చూపే మనసు కోసం ఎదురుచూస్తున్నా...


ఇది నిజం 
నువ్వు నాలో సగం...
ఇది నిజం

నువ్వు నా జీవితం...
ఇది నిజం
నేను నీకంకితం.


--ఇట్లు నా నీ ప్రేమ--

Saturday, March 17, 2012

నీకై పడే ఆవేదన...



నా ఊహలన్నీ నీ ఊసులే...
నా రాతలన్నీ నీ మాటలే...


నా మనసు నీకై పరితపిస్తోంది
                    నా దానివంటూ గుర్తుచేస్తోంది...
నా గుండె చప్పుడు ఆగిపోతోంది
                    నువులేని చోట ఉండనంటోంది...


నువు కలసిన ప్రతిసారీ ఏదో ఆలాపన...
అది నీకై నేను పడే ఆవేదన...


జీవితాంతం తోడుగా నిలుస్తావని
కలను చీల్చి నిజానివై వెలుస్తావని
నీవు లేక మనసు నాతో ఉండలేదని
నిలుపలేని ప్రమాణం చేయలేదని


నా మనసు నన్ను హెచ్చరిస్తోంది...
నీ ప్రత్యుత్తరానికై ఎదురుచూస్తోంది...

నా మనసు అలసిపోదు


నా జీవితం నీ జ్ఞాపకాల సమ్మేళనం

నీతో ఆడిన ఆటలు, చెప్పుకున్న ఊసులు
చేసిన  బాసలు, అనుభవించిన భాధలు
నిత్యం నువ్వు నాదానివని చెప్పిన ఊహలు
కంటికి శ్రమ లేని కలలు...

మధురమైన ఈ భావనల నడుమ 
                    సాగిపోతోంది నా జీవితం...
ఇంకా నువ్వే నా ప్రాణంఅంటూ
                    ఎదురు చూస్తోంది నీ కోసం...

నా మనసు అలసిపోదు, నీకై ప్రేమ తరిగిపోదు

కలలు చూపించావు...
                 నిజం మరిపించావు
తప్పు నాది కాదు అంటూ
                 వదిలివేసావు...
 
నా నీ కలల జేవితం వాస్తవం కావాలి
జీవితం కొత్తగా వెలుగు చూడాలి...

--ఇట్లు నా ప్రేమ --

Friday, March 16, 2012

నీకై ఎదురుచూపు





నీ రాకతోనే, నా మది వెలుగు చూసింది
నీ ఎడబాటు లోనే అది కరిగిపోతోంది
నీ మది తెలిపే సమాధానానికై
నా మది ప్రశ్నై ఎదురు చూస్తోంది...
నీ మది,
నీడలా నా తోడు అంటూ, నిజం కాదని వెక్కిరిస్తోంది...


నీ ఎడబాటు, నాకు తడబాటు
నీ శాపం, నాకు వరం
నీ కోపం, నాకు తాపం
నీ దుఃఖం, నాకు దుఃఖం
నీ సంతోషం, నాకు సర్వస్వం 


నీకై ఎదురుచూపు, నాకు ఓ తీపి జ్ఞాపకం
ఆ జ్ఞాపకాలతో  నీ ప్రేమకై ఎదురుచూస్తూ...


నా ప్రేమ... 



నీ మనసు అల లాంటిది



నీతో గడిపిన ఆ క్షణం ఓ కమ్మని మధుర భావన
నీ మనసు అల లాంటిది
                  నా మనసును మున్చివేస్తోంది...
గట్టు చేరువలో వదలనంటూ మొండికేస్తోంది...

మరువనంటూ మాట ఇస్తూనే...
                  ఎవరు అంటూ బెట్టు చేస్తోంది...
కనుల తడిలో తడిసిపోతూ...
                  కలను అంటూ కరిగిపోతోంది...

దిక్కు తోచని ఎడారిలో, 
                  ఎండమావై ఆశ పెడుతోంది
మబ్బు చాటు చినుకు లా,
                  బయలుపడుటకు సిగ్గుపడుతోంది
నేను లేని నా మది, నీకై ఎదురు చూస్తున్నది

నా ప్రతి శ్వాస, నా ప్రతి ఆశ నీకే అంకితం
నా సర్వస్వం నీవైనా..ఎందుకు ఈ ఎడబాటు ?
కరుణ చూపించు...ప్రేమ కురిపించు...నన్ను బ్రతికించు...





Thursday, March 15, 2012

నిన్ను చేరిన క్షణం...



నిన్ను చేరిన క్షణం...
            ఉరకలేస్తోంది నా యవ్వనం,
నిన్ను చూసి మూగబోయే ఓ నిజం...

            మనసు నెమరవేస్తోంది ఆ జ్ఞాపకం.


నా కనుచూపు వెతికే ప్రతి చోటా, 
నేనున్నానని నీ పలకరింపు...
నేను ఆస్వాదించే ప్రతి ఆశా,
నువ్వు నా దానివనే పులకరింపు...


క్షణక్షణం ప్రదక్షిణం, ప్రతిక్షణం విలక్షణం 
మరు క్షణం...

అది నీకే అంకితం...

నీ నవ్వు నా జీవితం



నీ నవ్వు నా జీవితం, నీ శ్వాస నాకంకితం
నీలోనే నేను నీ కోసమై నేను 
నిన్ను విడచిన క్షణం మనసు చేస్తోంది రణం...
నీవు లేని జీవితం రాత లేని కాగితం


లోకమంతా ఒక్కటై నిను వీడమంటోంది...
                     మనసు మాట వినను అంటూ ఘొల్లుమంటొంది...
నిన్ను చేరే ఊహలో మది పరవశిస్తోంది...
                     నీ కొసం కొత్తగా ఉరకలేస్తోంది...