Thursday, May 31, 2012

నా ప్రేమకు వరమిచ్చే దేవత...


మనసును మెప్పించే మౌనం నీ ప్రేమ,
కలలను రప్పించే కావ్యం నీ ప్రేమ... 
మది కోరిన తరుణంలో వరుణం నీ ప్రేమ,
ఎదలోతుల మురిపించే మక్కువ నీ ప్రేమ... 

అల్లరి ఆనందపు గెంతులతో,
                  చల్లని చిరుజల్లుల చిందులతో
కలలెరుగని కన్నులతో,
                  కలమెరుగని రాతలతో
మలుపెరుగని మార్గములో,
                  అలుపెరుగని ఆత్రముతో
నీ కనుచూపుల కరు్ణకై, తొలి చూపుల స్పర్శకై
నా మనసు నీకై ఎదురు చూస్తోంది...

నీ ప్రేమలో కాలం కమ్మగా కరిగిపోతోంది 
నయనం కలలకై కలవరిస్తోంది 
నా ఎదపై వాలే చిరు చినుకు నీ ప్రేమ...
నా మనసంతా పులకించే మల్లెలు నీ ప్రేమ...
నా కోసం తపియించే కోరిక నీ ప్రేమ...
నా ప్రేమకు వరమిచ్చే దేవత నీ ప్రేమ...

నా రాగం నీవు, అనురాగం నీవు...
నా స్నేహం నీవు,
                  నా కోసం నీవు...
నా బంధం, అనుబంధం, మకరందం నీవు 
నా ఆవేదన తరిగించే ఆనందం నీవు 
 నాతోనే నిత్యం ఉండే నా సర్వం నీవు,
సర్వస్వం నీవు...

Wednesday, May 30, 2012

 నీ స్వప్నాల రంగుల లోకం...


నీ కనుపాపల చిరు సవ్వడి నా నేస్తం..,
నీ చిరునవ్వుల మరుమల్లెలు నా కోసం.., 
ప్రశ్నలతో పరిక్ష పెట్టే ఆ ముఖారవిందం 
తానే జవాబై తికమక పెడుతోంది, 
మరిపించి మురిపించే ఆ వర్ఛస్సు 
తన మరపు కాదంటూ మభ్యపెడుతోంది...

ఆ వెన్నెల కోవెలవై,
                 మరుమల్లెల మాలికవై...
మురిపించే మాటలతో
                 చిరునవ్వుల చిందులతో...
కనుపాపల అలవోపగ కనిపించే దేవతవై
నాకోసం వస్తావని,
                 నన్నే కరుణిస్తావని
ఈ తొలకరి చిరుజల్లుల కనువిందుల తీరికలో 
నా కోరిక తీరుస్తావని,
                 నా ఆశలు ఆవిరి చేస్తావని... 
నాకు సర్దిచెప్పే నీ మనసు...

తొలి చూపుల మన ప్రణయం 
మెలకువ లో మొదలై
                 కలల్లో కొనసాగుతోంది...
నీ స్వప్నాల రంగుల లోకం
నను వాస్తవానికి దూరంగా
నిజానిజాల భేదాలను తెలిపే సన్నని రేఖపై
అల్లరి ఆనందపు అలలతో ముంచివేస్తోంది... 

మన కలయికలో యుగాలు క్షణాలై
మరుదూరాలలో క్షణాలు యుగాలై
నువ్వు నేను కలిసి చూసిన ఆనందపు అంచులు 
ఆజన్మాంతం ఉండాలంటున్నాయి... 
నీ నా దూరాలను తుంచాలంటున్నాయి... 
కలలోనైనా ఇల అంచులు దాటకంటున్నాయి... 
మురిపించే మరిపించే మనసులను 
                       కలిసిపొమ్మంటున్నాయి...



Tuesday, May 29, 2012

నిన్ను చేరాలనే కోరికతో...

 
నా ఆలోచన సాగే ఓ సుధీర్ఘ మార్గంలో...
నీ తలపుల సమూహాలు 
                  ఆ ఆలోచన నీదేనంటూ, 
నీవైపు సాగమంటూ దిశ నిర్ధేశణ చెస్తున్నాయి...

నీ కొంటెచూపులు,
ముళ్ళ బాటను సైతం పూలబాటగా మార్చి
సాగిపొమ్మని ప్రోత్సహిస్తున్నాయి... 
అలుపెరుగని ఈ ప్రయాణం
                  నీ ఊహలతో, నీకై ఆశలతో
నిన్ను చేరాలనే కోరికతో ఉన్నా
ఏదో తెలియని వేదన వెంటా
డుతోంది...

కదిలే కాలం, కరగని దూరం 
ఈ ప్రయాణ గమ్యాన్ని ప్రశ్నించమంటూ
ఆ గమ్యానికి చేరేదెపుడంటూ
నీ ఆలోచన ఎందుకంటూ నిలదీస్తున్నాయి...

నీకై చేసే ఈ పయనం
నిన్ను చూసి తీరాలనే నా నయనం 
                   నా మనసు వీడని నీ వదనం
నీ కరుణకై సాగుతున్న ఈ కదనం
                   నేను నీ కోసమే ఉన్నాననీ,
నువ్వు నాతోనే ఉంటావనీ గుర్తుచేస్తున్నాయి...

నా ఈ వేదన తరిగిస్తావనీ,
కదిలే కాలానికి అనుగుణంగా
దూరాన్ని కరిగిస్తావనీ...
-
ప్రేమకై పయనించే మనసు

Sunday, May 27, 2012

నిన్ను చేరే చివరి క్షణంలో చీకటి నింపావు...


నా ఆశల సంగమం నీవు
            నా ఊహల రూపం నీవు... 
నా కోరిక తీరిక నువ్వు 
            నా చేరిక గమ్యం నువ్వు...

నీవు లేక అంధకారంలో్ ఉన్న నాకు 
నీ కన్నుల కాంతులతో దారి చూపావు...
నిన్ను చేరే చివరి క్షణంలో
కనుమరుగై చీకటి నింపావు...
నిత్యం నీకై ఎదురుచూసే నా మది 
సత్యం తెలుసుకోక దారి తప్పుతున్నది

నీవే సర్వం అని నమ్మిన మనసు
నీవు లేవని తెలిసి మూగబో
తోంది 
తనకిక లో్కంతో పనేమిటంటూ ముగిసిపోతోంది...
గమ్యం చేరక మార్గమద్యంలోనే మారిపోతోంది...
బతుకు దండగంటూ,
              మరణమే శరణమంటూ
క్షణక్షణం కాలగర్భంలో కలుస్తానంటూ...
నిరంతరం నీకై రోధిస్తూ ఉంది...

ఈ వేదన ఆగేదెపుడు ?
నా రోదన ముగిసేదెపుడు ?
నీ చేరిక కలిసేదెపుదు ?
నా కోరిక తీరేదెపుడు ?

నీ జాబు అందిస్తావని, నా కోరిక తీరుస్తావని 
నా శ్వాశ నిలుపుతావని, నన్ను బ్రతికిస్తావని 
నీవై నిండి ఉన్న మనసుతో

-
నీ ప్రేమికుడు 

Saturday, May 26, 2012

నా మనసు తెలిపే ఆఖరి సత్యం...


నీవే లోకమైన నాకు, ఏదో తెలియని ఆందోళన...
అది నీ చేరిక లేదనే ఊహల సమ్మేళన...
కనులు మూసిన క్షణం 
కలవై ఎదురు నిలిచి
మెలకువ మొదలయ్యే క్షణం
కన్నీరై కరిగిపోతున్నావు...

నా ఆరాటాల కలయిక 
              నా ఆనందాల మూలిక...
నను వేదించే వేడుక
              నను కవ్వించే కానుక...
అది నీవు నా దరిచేరుతావనే కోరిక 

నా కలం రాసే చివరి రాత
              నా శ్రుతిలయల చివరి పాట...
నా కనులు చూసే ఆఖరి రూపం 
              నా మనసు తెలిపే ఆఖరి సత్యం...
అది శాశ్వతంగా నీవు లేని లోకాన్ని విడిచే క్షణం

ఏళ్ళు గడచినా ఏమారని నా మనసు...
మరపు వచ్చినా మురిపించే మనసు...
కనులు మూసినా, కలత వచ్చినా
ఆ ఆవేదన ఆగదనీ...
నీవు లేక సాగదనీ...
నా చివరి శ్వాశ సైతం నీకేననీ...

-
నీవు విడచిన మనసు

నీ నవ్వుల చిరుజల్లు...


నాలోని చిరు సవ్వడి నీ కోసం 
నాలోని మది సందడి నీ కోసం 
నీ నవ్వుల చిరుజల్లు 
                   నా మనసుని తాకిన క్షణం
ఒక కొత్త లో్కంలోకి వెళ్ళిన నా మనసు
నీవు లేని లోకానికి రానంటున్నది...

క్షణకాలం లో మనసు దోచి
                  మరుక్షణం మాయమై...
జన్మ నీతోనే అని మాటనిచ్చి 
                  అందని దూరాలకు చేరువై...

నీవు ఒంటరి చేసిన నా మనసు
తానొంటరి కాదంటూ...
నీ  జ్ఞాపకాలే తన తో్డంటూ...
నీవు విడచిన లో్కంలో
అలుపెరుగని ఆలోచనలతో,
ఊపిరి అడగని ఊహలతో,
నిరంతరం నీపై ఆశతో 
                   ఎదురుచూస్తున్నది...

నీ చేరిక నా జీవిత గమ్యం...
                   నా కోరిక నీతో బంధం...
మోడై మిగిలిన నా జీవితంలో
చిరుజల్లులు కురిపిస్తావని,
మరుమల్లెలు పూయిస్తావని,
నీకై నీ రాకకై ఎదురుచూస్తూ...

-
ఓ మనసు

Thursday, May 24, 2012

ఆశ తీరని ఆవేదన...


నీవు  చూపిన లోకం,
             చేరుకునే సమయం...
కనుపాపల మెలకువలో
             తొలి అడుగు తరుణం...

మాయమైన మనసు చెసే మౌనరాగంలో 
మురిపించే చెలి పలుకులు
నీ మరపును మరిపించే స్వప్నలోకములో
అలుపెరుగని ఆహ్లాదాలు

కష్తమైనా..!నష్టమైనా..!
నీతో నడిచే ప్రతి అడుగూ...
నీకై తలచే ప్రతి తలపూ...
ప్రతినిత్యం నాకిష్టం...

నీ చూపుల సరిగమల్లో
ఆశ తీరని ఆవేదన...
అది నాకై చేసే 
            తపసుకై ఎదురుచూపు...
నిన్ను చేరే 
            తరుణానికై కలవరింపు...