Tuesday, May 29, 2012

నిన్ను చేరాలనే కోరికతో...

 
నా ఆలోచన సాగే ఓ సుధీర్ఘ మార్గంలో...
నీ తలపుల సమూహాలు 
                  ఆ ఆలోచన నీదేనంటూ, 
నీవైపు సాగమంటూ దిశ నిర్ధేశణ చెస్తున్నాయి...

నీ కొంటెచూపులు,
ముళ్ళ బాటను సైతం పూలబాటగా మార్చి
సాగిపొమ్మని ప్రోత్సహిస్తున్నాయి... 
అలుపెరుగని ఈ ప్రయాణం
                  నీ ఊహలతో, నీకై ఆశలతో
నిన్ను చేరాలనే కోరికతో ఉన్నా
ఏదో తెలియని వేదన వెంటా
డుతోంది...

కదిలే కాలం, కరగని దూరం 
ఈ ప్రయాణ గమ్యాన్ని ప్రశ్నించమంటూ
ఆ గమ్యానికి చేరేదెపుడంటూ
నీ ఆలోచన ఎందుకంటూ నిలదీస్తున్నాయి...

నీకై చేసే ఈ పయనం
నిన్ను చూసి తీరాలనే నా నయనం 
                   నా మనసు వీడని నీ వదనం
నీ కరుణకై సాగుతున్న ఈ కదనం
                   నేను నీ కోసమే ఉన్నాననీ,
నువ్వు నాతోనే ఉంటావనీ గుర్తుచేస్తున్నాయి...

నా ఈ వేదన తరిగిస్తావనీ,
కదిలే కాలానికి అనుగుణంగా
దూరాన్ని కరిగిస్తావనీ...
-
ప్రేమకై పయనించే మనసు

No comments:

Post a Comment