నీ చిరునవ్వుల మరుమల్లెలు నా కోసం..,
ప్రశ్నలతో పరిక్ష పెట్టే ఆ ముఖారవిందం
తానే జవాబై తికమక పెడుతోంది,
మరిపించి మురిపించే ఆ వర్ఛస్సు
తన మరపు కాదంటూ మభ్యపెడుతోంది...
ఆ వెన్నెల కోవెలవై,
మరుమల్లెల మాలికవై...
మురిపించే మాటలతో
చిరునవ్వుల చిందులతో...
కనుపాపల అలవోపగ కనిపించే దేవతవై
నాకోసం వస్తావని,
నన్నే కరుణిస్తావని
ఈ తొలకరి చిరుజల్లుల కనువిందుల తీరికలో
నా కోరిక తీరుస్తావని,
నా ఆశలు ఆవిరి చేస్తావని...
నాకు సర్దిచెప్పే నీ మనసు...
తొలి చూపుల మన ప్రణయం
మెలకువ లో మొదలై
కలల్లో కొనసాగుతోంది...
నీ స్వప్నాల రంగుల లోకం
నీ స్వప్నాల రంగుల లోకం
నను వాస్తవానికి దూరంగా
నిజానిజాల భేదాలను తెలిపే సన్నని రేఖపై
అల్లరి ఆనందపు అలలతో ముంచివేస్తోంది...
మన కలయికలో యుగాలు క్షణాలై
మరుదూరాలలో క్షణాలు యుగాలై
నువ్వు నేను కలిసి చూసిన ఆనందపు అంచులు
ఆజన్మాంతం ఉండాలంటున్నాయి...
నీ నా దూరాలను తుంచాలంటున్నాయి...
కలలోనైనా ఇల అంచులు దాటకంటున్నాయి...
మురిపించే మరిపించే మనసులను
కలిసిపొమ్మంటున్నాయి...
No comments:
Post a Comment