నీవు చూపిన లోకం,
చేరుకునే సమయం...
కనుపాపల మెలకువలో
తొలి అడుగు తరుణం...
తొలి అడుగు తరుణం...
మాయమైన మనసు చెసే మౌనరాగంలో
మురిపించే చెలి పలుకులు
నీ మరపును మరిపించే స్వప్నలోకములో
అలుపెరుగని ఆహ్లాదాలు
కష్తమైనా..!నష్టమైనా..!
నీతో నడిచే ప్రతి అడుగూ...
నీతో నడిచే ప్రతి అడుగూ...
నీకై తలచే ప్రతి తలపూ...
ప్రతినిత్యం నాకిష్టం...
నీ చూపుల సరిగమల్లో
ఆశ తీరని ఆవేదన...
అది నాకై చేసే
నీ చూపుల సరిగమల్లో
ఆశ తీరని ఆవేదన...
అది నాకై చేసే
తపసుకై ఎదురుచూపు...
నిన్ను చేరే
తరుణానికై కలవరింపు...
No comments:
Post a Comment