Tuesday, April 3, 2012

యదలో ఒక మంట రగిలింది...


మోడై మిగిలిన నా మనసు
నీ మాట వినగానే చిగురించింది...
తొలకరి కను చూపులు పడగానే
నా తనువంతా పులకరించింది...

నీనుంచి నేను కోరేది...
నేను నీకై అందిస్తున్నది...
స్వప్న లోకం నిన్ను మరిపిస్తుంటే 
వాస్తవం నీ మరపును మరిపిస్తోంది...

నాకై వచ్చిన దానివని...
నాతో ఉండే రాణివని...
నీ మనసే నాది అని...
నా శ్వాసే నీకు అని...

మనసులో ముసలం మొదలైంది...
యదలో ఒక మంట రగిలింది...

అపోహల ఆలోచనలు
నన్ను పిచ్చివాడిని చేసాయి...
నిజాల నిర్మోహమాటాలు 
నిత్య వేదనకు గురి చేసాయి...


No comments:

Post a Comment