నా అడుగు కోరే తీరం నీవు...
నా దప్పిక తీర్చే తీర్ధం నీవు...
నా నోట పలికే మాట నీవు...
నన్ను బ్రతికించే శ్వాస నీవు..
నడక సాగించే పాదం
నీవైపే మరలుతోంది...
మాటలాడని మౌనం
నీకై గోల చేస్తోంది...
నిరంతర తపసు
నీకై వేచి చూస్తోంది...
నీ వరం పొందని మనసు
నన్ను తుంచివేస్తోంది...
నీకై ఎదురుచూసే నా నయనం
చేస్తోంది కడవరకు సాగే పయనం
నీ నా కలయిక
ఓ పగటి కలలా మిగిలిపోతోంది...
నిదుర రాక నిత్యం నీకై కదిలిపోతోంది...
గమ్యం లేని నా జీవితానికి
దారి చూపి నా లక్ష్యంగా నిలిచావు...
ఇక వెనుతిరగలేను
నిను వీడి పోను...
No comments:
Post a Comment