Monday, April 2, 2012

ఎన్నడూ స్వప్నం కాను...



నా పలుకుల చాటున దాగిన నిజం
నీవని తెలిపే నా చిరు చెమటల అల్లరి...
ఏదో మర్చిపోయానంటూ మాటిమాటికి
నా మనసుని ముందుకులాగే 
                       నీ మాటల గిల్లరి...


అనుక్షణం తడబడే మాటలు...
ప్రతిక్షణం మూతబడే కనులు...

సందర్భం కోసం చూసే చూపులు...
సరైన సమయానికై కాపులు...


నే ఎదురుచూసే రూపం నీది...
నన్ను బంధించే కనుచూపు నీది...
నా మాటల ప్రతిమాట నీది...
నా మనసు పలికే ప్రతి పలుకు నీది...


నీకై బ్రతికే నేను..
ఎన్నడూ స్వప్నం కాను...

వేయి కన్నులతో వేయి జన్మలైనా  
ఎదురు చూస్తూనే ఉంటానని 
మాట ఇస్తూ...


-
--నీకై ఎదురు చూసే మది--

No comments:

Post a Comment