Sunday, March 25, 2012

తోడు లేని నా మనసు...



నీవు నా జీవితంలో లేకపోయినా...
నా మనసు నీకే అంకితం...
నా ప్రేమయొక్క ఏకైక లక్ష్యం నీ సంతోషం...


నీవు నన్ను చేరవని తెలుసు...
నీవు లేక నా మనసు ఉండలేదనీ తెలుసు...
ప్రతి క్షణం నీకై ఆలోచిస్తూ 
నిన్ను చూసిన క్షణం 
             నా మనసు మూగబోతోంది...
మాట్లాడలేనంటూ బెట్టు చేస్తోంది...


తోడు లేని నా మనసు
            ఒంటరై ఒరిగిపోతోంది...
నీవు లేని చోట 
            ఉండలేనంటూ కరిగిపోతోంది...


నా ఈ జీవితం నీ సంతోషానికే అంకితం...
నీకై పరితపించే మనసు
                         నిన్ను వీడనంటోంది... 
ప్రతిక్షణం నీ తోడు కోరుతోంది...
మరుక్షణం నీవు లేని చోట ఉండనంటోంది ...


నా ఈ దుఃఖం నీ జీవితానికి అడ్డు కాకూడదు...
అందుకే 
నీకు నా బాధ అంటనంత 
                        దూరాలకు వెళ్ళిపోతున్నాను...
సుధీర్గ లోకాలకు సాగిపోతున్నాను...  


--ఇట్లు నీకై నా ప్రేమ---

No comments:

Post a Comment