నీ ఊహల మకరందం
నాకు తరగని ఆనందం...
నీ చేష్టల ఉత్తేజం
నా కలలకు ఆకారం...
నా ఊహకు హద్దు లేదు
నా ప్రేమ కు భాష లేదు
కలం కరిగిపోతోంది
దూరం పెరిగిపోతోంది
వ్యతిరేకించే ఉద్దేశ్యాల నడుమ
నలిగిపోతోంది నా మనసు...
నిర్ధారణ లేక వేయలేకపోతోంది ముందడుగు...
నన్ను చూపే దర్పణాలు నిన్ను చూపుతున్నాయి
నేను అంటూ లేను అంటూ
నీవు వుంటే నిజం అంటూ ఏడిపిస్తున్నాయి
భరించలేని ఈ వేదన ఇంకెన్నినాళ్ళో..?
నిన్ను చూపే నిజం కోసం వేచిచూస్తున్నా...
ప్రేమ పంచి కరుణ చూపే మనసు కోసం ఎదురుచూస్తున్నా...
ఇది నిజం
నువ్వు నాలో సగం...
ఇది నిజం
నువ్వు నా జీవితం...
ఇది నిజం
నేను నీకంకితం.
--ఇట్లు నా నీ ప్రేమ--
No comments:
Post a Comment