నా ఊహలన్నీ నీ ఊసులే...
నా రాతలన్నీ నీ మాటలే...
నా మనసు నీకై పరితపిస్తోంది
నా దానివంటూ గుర్తుచేస్తోంది...
నా గుండె చప్పుడు ఆగిపోతోంది
నువులేని చోట ఉండనంటోంది...
నువు కలసిన ప్రతిసారీ ఏదో ఆలాపన...
అది నీకై నేను పడే ఆవేదన...
జీవితాంతం తోడుగా నిలుస్తావని
కలను చీల్చి నిజానివై వెలుస్తావని
నీవు లేక మనసు నాతో ఉండలేదని
నిలుపలేని ప్రమాణం చేయలేదని
నా మనసు నన్ను హెచ్చరిస్తోంది...
నీ ప్రత్యుత్తరానికై ఎదురుచూస్తోంది...
hai guys
ReplyDeletehello sree...
ReplyDeletecan you give me the feedback for this blog...