నేను కోరేది నీ తోడ్పాటు...
తగ్గించు ఈ ఎడబాటు...
మన్నించు నా పొరపాటు...
కడవరకు సాగు నాతోపాటు...
నా దుఃఖాన్ని తుడిచే చేయి
నీదవ్వాలని నా కోరిక...
నే సాగే మార్గంలో నీవు
నా నీడవ్వాలని నా ఆశిక...
నా కన్నీటి సాగరం నన్ను ముంచేలోగా
ఒడ్డున చేరుస్తావని ఎదురు చూస్తున్నా...
నా జీవిత గమ్యం నీవని చూపే
కల కోసం కన్ను మూస్తున్నా...
నీవు నన్ను చేరిన క్షణం
నన్ను నేను మరచాను...
ఇక నిన్ను మరువలేను...
నిన్ను వీడి బ్రతుకలేను...
నీవు లేక నేను
పచ్చటి చిగురుటాకులు లేని మోడైపోతున్నా...
ప్రవాహం లేని నదిలా కుమిలిపోతున్నా...
నా జీవితంలో పచ్చదనం నింపి
నాలో ఒక ప్రవాహాన్ని పుట్టించే తోడు
నీవని వేచి చూస్తున్నా...
వేయి కన్నులతో ఎదురు చూస్తున్నా...
No comments:
Post a Comment