ఎదురు చూసే కనుచూపులో
లోకం చిన్నదై పోతోంది...
మనసు పలికే మాటలలో
కష్టం అంటూ క్రుంగిపోతోంది...
నీ మదే నా యదే కోరిన క్షణమే...
నా మదే నీ చూపుకై ఎదురు చూసే...
స్వప్నం చూపిన లోకం
నిన్ను వీడమంటోంది ...
మనసు చంపుకొని
నిన్ను మరువమంటోంది ...
ప్రాణం నీకై మిగిలి ఉన్నా...
మనసు మాత్రం మరణిస్తూంది...
ఎన్ని రోజులైనా ఎంత కాలమైన
మరిగే మనసు నిన్నే కోరుతూ ఉంది...
నే కను మూసే క్షణం
నే చివరగా పలికే పదం
నీ నామధేయం...
అది నే చేసే చివరి పుణ్య కార్యం...
No comments:
Post a Comment