Saturday, March 24, 2012

నిన్ను చేరే బాటలో...



అందమైన అబద్దాల నడుమ
నిజమై నలుగుతున్న నా మనసు
కలలు చూపే దారిలో 
                  కనుమరుగైపోతోంది...
నయనం కురిపించే వానలో 
                  తడిసిపోతోంది...

నిన్ను చేరే బాటలో 
                  రాళ్లు ఎన్ని తగిలినా...
నీకై వేసే అడుగులో 
                  ముళ్లు ఎన్ని  గుచ్చినా...


నీకై సాగే పయనం ఆగదు...
నీకై వేచే మనసు మాయదు...

నీ బాధ చూడలేను...
నా బాధ చెప్పలేను...
నిన్ను నే వీడలేను...
నీవు లేక బ్రతుకలేను...


నీ సంతోషానికై
నేనెంతటి బాధనైనా అనుభవిస్తాను...
తలపు లేక నీకోసం ప్రాణమిస్తాను...



No comments:

Post a Comment