నా రంగుల ప్రపంచం
అవుతోంది తెలుపు నలుపుల సమ్మేళనం...
నిన్ను చూసి కలవరించే సమయం
మనసు మొదలెడుతోంది నీకై పయనం...
కలగా కరిగిన నీవు
నా కంటికి వరం...
నిజమై నిలచిన నేను
మరువలేని జ్ఞాపకం...
నిత్యం నీకై పరితపిస్తూ...
నీ ఊసులనే ఊపిరిగా సేవిస్తూ...
నన్ను శాసించే మనసు
నీకై తుది శ్వాస విడుస్తోంది...
నా సంతోషం నీవని తెలిపిన క్షణం
నీ బదులు తెలుపని క్షణం
నా మనసు నీదని చెప్పిన క్షణం
నీ మనసుకై ఎదురు చూసిన క్షణం
నా మనసు అనుభవించిన ఆ వేదన
నిన్ను చేరుకోలేకపోయినందుకు నే పడిన ఆవేదన...
నేనంతా నీవైనా
నా శోకం నిన్ను చేరనివ్వను...
నా మనసును బాధ చెప్పనివ్వను...
ఇట్లు
--మోడై మిగిలిన నా మనసు--
No comments:
Post a Comment