Monday, March 26, 2012

కనుమరుగయ్యే నా మనసు...


నిన్ను తలచే ప్రతిసారి ఏదో తెలియని చింత...
ఇక నిన్ను అసలు పొందలేనేమో అని జీవితమంతా ...

గడిచే నిమిషాల నడుమ
                   నీ తలపు నలిగిపోతోంది...
దానికైనా అర్హత లేదంటూ
                   నన్ను విడిచి వెళ్ళిపోతోంది...

కనుమరుగయ్యే నా మనసు
నీ తొలకరి నవ్వుకై 
                   ఎదురు చూస్తోంది...
హద్దులు చెరిపే నీ మనసు
అదే హద్దు దాటకంటూ ఆనతిస్తోంది...


కనులు వెతికే కలల మార్గం
నిజం కాదని తెలిసినా...
నిజానిజాల ప్రశ్న ఎత్తక 
కలల ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నాను...

ఈ బాధ నుండి విముక్తి కల్గిస్తావని ఆశిస్తూ

--నీకై నా ప్రేమ--

No comments:

Post a Comment