Sunday, March 25, 2012

ఈ బాధ తాళలేనిది...



నాకు తెలియదు
నీ మనసు నాకు అందదని...
నాకు తెలియదు
నా మనసు ఒంటరి అవుతుందని...


నీవు మాట్లాడిన మొదటి క్షణం
ఏదో తెలియని 
            అలజడి మొదలైంది...
ఆ అలజడి వేడిలో నా మనసు 
నీ ఉత్తరానికై 
            నడక సాగించింది...


గడచిన కాలం
నాకు జ్ఞాపకాలని మిగిల్చింది...
నడిచే మౌనం 
నా మనసును బంధించింది...


నిజానిజాల సమరంలో
నిరాయుదుడిగా నిలిచిపోయాను...
తోడులేక నీకోసం నేలరాలాను...


ఈ నరకం భరించలేనిది...
ఈ బాధ తాళలేనిది...
  






No comments:

Post a Comment