Tuesday, March 20, 2012

రోధిస్తుంది నా నయనం...


నా మనసు లోని ప్రేమ నీతో చెప్పాలనే నా తపన

నీవు నన్ను విడచు క్షణం
రోధిస్తుంది నా నయనం
నిత్యం నాతో ఉంటానని మాటివ్వమంటూ
నీ తోడుకై మొదలవుతోంది పయనం 

నన్ను నేను మరచాను
                   నీకై వెతికాను
ప్రేమ పక్షిలా విహరిస్తూ
                   అలసిపోయి నేలరాలాను

కాలాలు కరిగిపోతూ
దూరం ఎంతని ప్రశ్న వేస్తున్నాయి... 
సమాధానం లేని మనసు మూగబోతోంది
కాలం నాకోసం ఆగనంటూ కదిలిపోతోంది...

నన్ను కరుణించేదెపుడు...?
నాకు మనసిచ్చేదేపుడు...?
నీ ప్రేమకై వేచి ఉన్నా...
అందుకే మిగిలి ఉన్నా...


No comments:

Post a Comment