గుండెల్లో ఎన్నెన్నో ఆశలు...
కళ్ళలో మాసిపోని బాసలు...
నిన్ను తలచే ఉచ్వాస నిశ్వాసలు...
నిన్ను చూపే నా ఊహలు...
నా అలుపెరుగని ప్రయాణం
నీ మది కోసమే పయనం...
నిన్ను చూసి సిగ్గుపడే నయనం
దరిచేరగానే చిన్నబోతోంది పాపం...
నీ లోకంలో నేనున్నాను...
కానీ నాకు నువ్వే లోకం...
నీకై సాగే నడక తడబాటు లో...
నీకై నే చేసే పొరపాటుల్లో...
నీ తొలకరి నవ్వు
సాగిపోమ్మంటూ ముందుకు తోస్తోంది...
నా ప్రేమ తెలిపిన క్షణంలో
నేను చూసిన నీవు
ఎందుకు మారిపోయావు...?
నన్నెందుకు మారమన్నావు...?
నిన్నెందుకు మర్చిపోమ్మన్నావు...?
thank you vry mch...
ReplyDelete