నేను చేసే తపస్సు , పొందాలనే నీ మనసు ...
తరిగి పోనంది దూరం...
కరిగి పోతోంది కాలం...
నిన్ను చేరాలనే ఆశతో
నిన్ను చూడాలనే ఘోషతో
నీవు వేసిన శిక్ష గాయపెడుతోంది...
గాయపడిన మనసు బాధపడుతోంది...
కలనైనా...నిజమైనా...
నీ కొరకే నా శ్వాస
నీ పైనే నా ఆశ...
నా ఆనందం నీవే
నా ఆవేదన నీవే...
నా ఆలోచన నీవే
నా ఆచరణ నీకే...
ప్రతినిత్యం నీ యోచనలతో నీ ఊహలతో
నీకై ఈ నిరీక్షణ నా ప్రేమతో...
No comments:
Post a Comment