నీతో గడిపిన ఆ క్షణం ఓ కమ్మని మధుర భావన
నీ మనసు అల లాంటిది
నా మనసును మున్చివేస్తోంది...
గట్టు చేరువలో వదలనంటూ మొండికేస్తోంది...
మరువనంటూ మాట ఇస్తూనే...
ఎవరు అంటూ బెట్టు చేస్తోంది...
కనుల తడిలో తడిసిపోతూ...
కలను అంటూ కరిగిపోతోంది...
దిక్కు తోచని ఎడారిలో,
ఎండమావై ఆశ పెడుతోంది
మబ్బు చాటు చినుకు లా,
బయలుపడుటకు సిగ్గుపడుతోంది
నేను లేని నా మది, నీకై ఎదురు చూస్తున్నది
నా ప్రతి శ్వాస, నా ప్రతి ఆశ నీకే అంకితం
నా సర్వస్వం నీవైనా..ఎందుకు ఈ ఎడబాటు ?
కరుణ చూపించు...ప్రేమ కురిపించు...నన్ను బ్రతికించు...
No comments:
Post a Comment