Saturday, April 2, 2016

చిన్ని చిన్ని ఆశలకు..సర్ది చెప్తున్నా..



సమయం తెలియని నీ పరిచయం
నిజమని నమ్మేలోపే
కాలం తో కదిలిపోయింది..

నువ్వు నన్ను వీడిపోలేదు
నా మనసు తీసుకెళ్ళావు..

నీదైన నా మనసు బదులుగా
నీ మనసు నాదిగా ఇస్తావని..
కదిలిపోయిన పరిచయానికి
కొత్త ప్రాణం పోస్తావని..
ఆశ పడుతున్న
నా చిన్ని చిన్ని ఆశలకు

సర్ది చెప్తున్నా..
మన హద్దుల పరిచయం గురంచి
బయట పడని లోచనల గురించి
నమ్మాలి అనుకోని నమ్మకాల గురించి
విడి వేధన తాళలేని మనసు గురించి
అది చూపించే ఒకవైపు ప్రేమ గురించి
నీ తరువాత కూడా నీకై ఆలోచించే పిచ్చితనం గురించి..

కానీ
నా ఆశలు మనసు మాట కై
నా మనసు నీకై
నా మాట విననంటూ మారాం చేస్తున్నాయి..

నీది కాని నీ మనసుని
నువ్వెలా శాసిస్తావు అని ప్రశ్నిస్తున్నాయి..
ధైర్యం లేని వాడికి మేమెందుకు అని నిలదీస్తున్నాయి..

వాటికి తెలియదు
ఇది మన బంధం పూర్తిగా
తెగకూడదనే ఆరాటమని..
మనసు లేని ఆశలకు ప్రాణం ఉండదని..

అందుకే నా ఆ చిన్ని ఆశలకు
సర్ది చెప్తున్నా..
దేనికైనా సిద్ధం అవ్వమని
కాలం మనది కాదు అని
నువు దగ్గర కాలేని దూరాలకు వెళ్ళిపోతున్నావని..

నాది కాని నీ మనసు
తోడున్న నా మనసుతో
ఎప్పుడూ సంతోషాల చినవ్వులు చిందిస్తుండాలని
ఆశిస్తూ...

నీదైన నా నీడ
ప్రేమ కవి చిన్నా (Ven G)

Friday, March 15, 2013

ఈరోజు నా స్నే'హితురాలు' పుట్టిన రోజు.


ఈరోజు నేను మరువని రోజు.
నా జీవితం లో
నా మనసు పలికే
నీ నామ సంకీర్తనల మేళవింపుతో కూడిన
కవితల సారిక మొదటి పుట్టిన రోజు.

నీవంటే నాకెంత ఇస్టమో
నీ చిరునవ్వు ఎంత ఇష్టమో

మాటలలో చెప్పలేని సందర్భమ్లో
కవితల వల్లరిగా
నా భావాలను బయట పెట్టిన
నా రెండవ మనసు పుట్టిన రోజు.

ఈరోజు నా స్నే'హితురాలు' పుట్టిన రోజు.

-
చిన్నా

నా మనసు నిన్ను చేరే లోపు


ఇది నా మనవి నీతో
నను కలవమని
ఇదే నా మనవి నీతో
నను చేరుకొమ్మని

నా చిరు ఆశల పందిరి లో
మరుమల్లెల సందడిలో

ఆకాశం అడ్డు వచ్చినా
భూమి సైతం బెట్టు చేసినా

నిన్ను చేరక మానదు నా హ్రుదయం
నీ ప్రేమను పొందక మానదు ఈ తరుణం.

అందుకే మనవి చేసుకుంటున్నా ప్రియతమా..!!!
నా మనసు నిన్ను చేరే లోపు
నీ మనసు కరిగే లోపు

నా హ్రుదయ స్పందనని
నీ సువర్ణ హస్తాలతో
నశింపజేసి

నీవులేని ఈ జీవన నరకం నుండి బయట పడేస్తావని
నీ చేయి కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రియతమా...

-
చిన్నా

Wednesday, March 13, 2013

నీకై వేచి చూసే ఈ చిన్నా చిన్ని హ్రుదయం...


మర్చిపోను...
నీతో సాగిన ప్రయాణాన్ని,
మర్చిపోను...
నీతో పెట్టిన ముచ్చటలని,

నా హ్రుదయ స్పందన చేసే చప్పుడు...
నీ చిలిపి నవ్వులను గుర్తుచేస్తుంది.
నా కలల కెంపులు పెట్టే అలజడి...
నీ మెరుపు చూపులను గుర్తుచేస్తుంది.

అయినా నీ కోసం మౌనంగా ఉన్నాను...
నీతోనే మౌనంగా ఉన్నాను...

నాకు తెలుసు
ఎదో ఒక రోజు నా మౌనం కంచెలు దాటుతుందని.,
నీ కనుల ఎదుట వాలుతుందని.,

ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ
నీకోసం ఈ కవితలు రాస్తూ
నిన్ను మరువకుండా
నీ గురుతులను చెరపకుండా

-
నీకై వేచి చూసే
ఈ చిన్నా చిన్ని హ్రుదయం.

Tuesday, March 12, 2013

కనీసం ఈ ప్రశ్నలకైనా జవాబు ఇవ్వు ప్రియతమా...!!


ఓ ప్రేమా...నీకోసం...

నీవైన లోకం లో నీవున్న మార్గం లో
నీ కంటి చూపుకై, నీ పంటి బిగుపుకై
నీకోసం వేచున్నా...

కనులు తెరిచిన తరుణం చుసిన రూపం
కనులు కో్రే ఆఖరి రూపం


అనుకున్నాను
నువ్వు నా దానివని.
నా తోడై నిలిచే నీడవని.

ఏమీ తోచక మనసు తల్లడిల్లి పోతోంది.
నిత్యం నీ యోచనలతో కృశించిపోతోంది.
నేనేం చేయను ??
ఎలా ఉండను ??
కనీసం ఈ ప్రశ్నలకైనా జవాబు ఇవ్వు

ప్రియతమా...!!

కలత చెందుతున్న ఈ హ్రుదయాన్ని

ఊరట కలిగించే మాటల మంత్రం
నాపై ప్రయోగించు నేస్తమా...!!

-
చిన్నా

నా ప్రేమ మూగ ప్రేమ లా ఉంటుందో తెలియదు...


ఓ ప్రేమా... నీ కోసం వేచున్నా...
నీ మాటల గారడి నా చెవిన పడే తరుణం కోసం
నీ అల్లరి సందడి నా మనసుని తాకే క్షణం కోసం
నీ కోసం వేచున్న...

నీకై రాసే కవితల అలసట తెలుస్తున్నా,
నా చేతుల రాతలు కుమిలిపోతున్నా,
నీ చిరునవ్వు నా తోడుగా
నీ సిరి మువ్వల సందడి నా నీడగా
చెరే సమయం కోసం, నీ కోసం వేచి ఉన్నా...

నా మది నీకై తలుస్తోంది.
నీ మది సంతసానికై పరితపిస్తోంది.

ఎంత కాలం ఇలా నా ప్రేమ
మూగ ప్రేమ లా ఉంటుందో తెలియదు...
ఇంకెంతకాలం నిర్జీవమై ఉంటుందో కూడా తెలియదు.
ఐనా నీ కోసం నీ తోడు కోసం వేచి చూస్తాను.

-
చిన్నా

Friday, March 8, 2013

పాపం దానికేం తెలుసు...



ప్రియతమా..!! నీవచట కుశలమా...!!
నేనిచట కుశలమే...

గడిచిన కాలమంతా
నిన్ను ఈ ప్రశ్న వేయమంటోంది.

పాపం దానికేం తెలుసు
నీవు కూడా తన లాగే తిరిగి రావని.
మనసు మారి మరలటం వీలు కాదని.

పాపం దానికేం తెలుసు
నీ మనసు వేరొకరితో నిండి ఉందని.
నీ నీడ సైతమైనా దొరకబోదనీ.

నీ కనుల చూపు కోసం
నీ పెదవి విరుపు కోసం
నీ మధుర మాట కోసం 
నీ నవ్వులాట కోసం

ఎదురు చూసె నా మది ఇలా
కరుగుతున్నది.
కరిగిపోతు కూడ నిన్ను 
తలుస్తున్నది.

-
చిన్నా (జి.వి.ఆర్)

Thursday, February 21, 2013

నీకై నీ ప్రేమకై తపన పడే ఓ ప్రేమ


నా మనసులోని ఒక వేదన...

నిన్ను కలవాలనే భావన...

జీవితాంతం మోడై నిలవాల్సిన నన్ను
నీ మాటలతో 
చిరు చిరు నవ్వులతో
చిగురింపజేశావు.

నా ఈ పయనానికి అర్దం నీవనీ
నీవు లేని నా లోకం శూన్యమనీ

నా ఈ మనసు రాసే కవితల భావం
కనుమరుగయ్యే తరుణం 
నా జీవితములో 
మెల్ల మెల్లమెల్లగా సంతోషపు ఛాయలు తెస్తూ
నిత్యం తోడుంటావనీ

వేచి చూస్తూ
నీకై నీ ప్రేమకై తపన పడే
ఓ ప్రేమ

-
చిన్నా ( జి.వి.ఆర్ )

Monday, December 17, 2012

నీ చెలిమి చేరే గడియ కోసం ఎదురు చూస్తూ ఉంటాను...


ఎందుకో తెలియదు
నా మనసు నిన్ను మరువనంటోంది...
ఎందుకో తెలియదు
నా మది ఇక ఆగనంటోంది...

ఇన్నాళ్ళూ వేచిన  హృదయం
నీతో చేసిన ప్రతివాదన,
నీతో చేసిన  తొలి సాధన,
నీకై పడిన  మదివేదన,
నీ చెలిమికై చేసిన ఆరాధనల యొక్క పున: నిర్మాణానికై
ఎదురు చూస్తోంది.

ఎన్ని రోజులు గడచినా
ఎంత  ఆలోచించినా అర్ధం కాని విషయం...
నీతో స్నేహం...

నా మది విచారిస్తే,
నీ మాట  ఆ  బాధను తొలగిస్తోంది.
నా మది ఆనందిస్తే
నీ తలపు ఆ  సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది...
నీవు నిండిన  నా నీ ఊహల సమాహారం 
నా జీవిత మార్గాన్ని నిర్ణయిస్తోంది...

నా మనసు నిరంతరం
నీవే మూలమని సూచనిస్తోంది.
నిన్ను చేరుకొమ్మని ఆనతిస్తోంది.
కవితలు రాసే నా కలం విరిగి
నీతో సూటిగా మాట్లాడే రోజు కోసం ఎదురు చూస్తోంది...
జీవితాంతం స్నేహమైనా చేయమంటూ హెచ్చరిస్తోంది...

నా మనసు మాట వింటూ
నీ స్థానం నీదేనంటూ
నీ చెలిమి చేరే గడియ  కోసం ఎదురు చూస్తూ ఉంటాను...

-
చిన్నా

Friday, November 2, 2012

క్షణక్షణం నరకంలా కాల్చివేస్తోంది....


ఎన్ని రోజులు గడిచినా, ఎంత ప్రయత్నించినా
నా మనసు నీకై ఇంకా పరితపిస్తోంది...
నీ మదిని వీడలేనంటోంది,
మరులోకం చూడలేనంటొంది.

కనులు మూసిన క్షణం
నీ తలపు సైతం ప్రశ్న వేస్తోంది.
మనసు మారనంటూ
              నిను వీడనంటూ
నీవు లేక ఉండలేనంటొంది.

నా మనసుకి సర్దిచెప్పలేకపోతున్నాను...
దాని తీరును మార్చలేకపోతున్నాను...
నీ తలపును తరమలేకపోతున్నాను...
నా కనులను తుడవలేకపోతున్నాను...

ఇంకెంత కాలం ఇలా అనీ
             మది కుదుటపడే క్షణమేదనీ
ప్రశ్నల వర్షం నన్ను వరదలా మారి ముంచివేస్తోంది...
క్షణక్షణం నరకంలా కాల్చివేస్తోంది....

నా మదిని ఏమార్చిన నీవే 
             నా మనసుపడే వేదన తీరుస్తావనీ
నీ మదురమైన మాటలతో 
             తిరిగి నన్ను మునిపటిలా మారుస్తావనీ
నీ రాక కోసం నా మనసు ఎదురుచూస్తోంది...
నా శ్వాస నీకై నిలిచిపోతోంది.



Tuesday, July 24, 2012

నీకోసం వేచిన కనులకు కన్నీళ్ళే కరువైతే...




నీకోసం వేచిన కనులకు కన్నీళ్ళే కరువైతే
నా కన్నుల కలవై నువ్వు ఇంకా కవ్విస్తున్నావు...


నాకోసం కాదనీ నీకోసమేననీ
నీతోనే ఉంటాననీ, నీతో నడుస్తాననీ


మాటిచ్చే మౌనంతోనే మరపై పోతున్నానా???


నా గుండెలోని దేవతవై నా జీవితమంతా 
నాకోసం వస్తావనీ, నీ మనసే ఇస్తావనీ
నిత్యం నీకై ఎదురు చూస్తూ...


నీ మాటల మధురిమ కోసం తపియించే నా మది మాత్రం 
నీ తలపే సరి అని అంటూ
                నీ మనసే మారదు అంటూ...
నేనింకా ఒంటరినంటూ
                జీవితమే లేదని అంటూ...


గతమంతా మరిచేస్తూ
                భవిష్యత్తూ లేదంటూ
నిన్న జరిగినది రేపు రాదనీ
                నీ మనసిక వేరొకరిదనీ
నా ప్రాణం విలువ నీవనీ
నీవు లేక అది లేదనీ


చిట్టచివరి కావ్యం నీకోసం రాయమంటూ
నీవు లేని లోకాన్ని వదలమంటూ


నా మనసు నన్ను
తుది శ్వాస నీకై వదలమంటోంది
మరు శ్వాస ఇక వలదు అంటొంది...

Sunday, July 15, 2012

నా చేయి ఒంటరిదని...


నీవు నన్ను కాల్చివేసినా
నా మనసు కోటను కూల్చివేసినా
వెలుగునార్పి చీకటి నింపినా
          నిన్ను వెతికే మదిని చిత్తు చేసినా
కాలానికి సైతం సవాలు వేస్తూ
          నీకోసం ఆపుతానంటూ
నీ కదలికతో కదుపుతానంటూ


నా జీవిత సారం నీవని తెలిసి
నే కోరే గమ్యం నీ వలపని తెలిసి
మరలా నీకై, నీ తలపుకై
ఎదురుచూసే నా మనసుని
           ఆగిపొమ్మంటూ...
నీకై కొంతకాలం ఇంకొంతకాలం
           మదిని అణచుకొమ్మంటూ
నీవనే మాటల గారడి
పదే పదే గుర్తుకొస్తుంటే...


నీ చేయి పట్టుకుని
           ఓ సుధీర్ఘ పయనానికి

నడుచుకుంటూ వెళ్ళాలనిపిస్తోంది...
మరు క్షణం నా చేయి ఒంటరిదని జ్ఞప్తికొస్తోంది...


నీ చేతి స్పర్శ లేక నా మనసు 
నిర్వీర్యమైపోయింది...


ఈ ఒంటరి పయనానికి తోడునందిస్తావనీ,
జీవితాంతం నా చేతిని వదలకుంటావనీ,
ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ అనే నా ఆవేదన 
            తీరుస్తావని ఆశిస్తూ
నీపై తరగని ప్రేమతో...

-
నీ ప్రేమికుడు  


Monday, July 2, 2012

నీతో తెలిపే ధైర్యం లేదని...


కనులు మూసినా కనులు తెరచినా
కలతవై నువు ఎదురొస్తుంటే...
కనుల ఎదురుగా కనుమరుగయ్యే
మనసు మాట విననంటోంది...
మాటలలోని మధుర భావనే
మూగబాసయై మురిపిస్తుంటే...
మది కోరే తలపు నీవనీ
మనసు నీకై చని వస్తోంది...

జీవితమంతా నీతోనేనని
               నీతో తెలిపే ధైర్యం లేదని...
సమయం సహకిరిస్తే
               నీవు కలవనిస్తే...
నా తలపు తెలిపే తరుణం కోసం 

నీకై నా మది ఎదురుచూస్తోంది...

నిన్ను చూసిన ఆఖరి తరుణం
మదిని వీడి పోను అంటోంది...
నిన్ను వీడిన ఆ తొలి సమయం
మనసును సాంతం ముంచివేస్తోంది...

ఇది కవిత కాదనీ,
                నా మనసు మాటనీ...
ఇది నీ కోసమేననీ,
                నన్ను నీతో కలపాలనీ...
చీకటి తుంచిన చేతులతోనే
జీవితాంతం వెలుగు నింపమని
మురిసిపోయే మనసుతో,
కవ్వించే కులుకులతో,
జీవితమంతా నాతో ఉంటావని
మాటిస్తావని కోరుకుంటూ...

-
నీవై నిండిన మనసు 




Sunday, July 1, 2012

నా హ్రుదయ స్పందన నీకని తెలుసు..


నా మనసు నీదని తెలుసు...

నా కలవు నీవని తెలుసు...
నా కలత నీకై చూసే
నా హ్రుదయ స్పందన నీకని తెలుసు...

నిన్ను చేరే ఆశ నాలో
          నిండి ఉన్నా చెప్పలేను...
నీవు నా సర్వస్వమైనా,
          మనసు మాత్రం విప్పలేను...

మనసు మాటలు నోటి వరకూ
నోటి మాటలు పెగలలేవు...
నీవంటే ఇష్టమున్నా
          అది తెలిపే ధైర్యమున్నా
దూరమైతే..! అను భయంతోనో
మనసు మాత్రం కదలలేదు...

నా మనసు తెలిసి కూడా
          బయటపడవెందుకని నేస్తం..?
నా తలపు తెలిసి కూడా
          నీ తలపు తెలుపవె నేస్తం..?
నాకు రాదని గేలియేలా.,
నీవు కూడా తెలుపవచ్చు...

మనసు నీదీ నాది కాదని,
మనది మనది మనసు ఒకటని
నీవు తెలిపే రోజు కోసం 

వేచి ఉన్నా ఓ నా ప్రాణం...

తెలుపలేని మనసుతో
తెరవలేని తలపుతో
-

నీ నేను 

Saturday, June 30, 2012

నీ ప్రేమసాగరంలో...


పగటి రేత్రుల కలయిక మన స్నేహం...

నిండు మనసుల అల్లిక మన స్నేహం...
చిగురుటాకుల సవ్వడి మన స్నేహం...
చిలిపి చినుకుల అల్లరి మన స్నేహం...

నీ జతలో విరిసే పువ్వునై...
                నీ మదిలో నే చిరుజల్లునై...
నీ నయనం కోరే స్వప్నమై...
                నీ పయనం చేరే గమ్యమై...
కలల లోకం కావ్యమైతే,
కనులు అడిగే కవితనై...

మనసు నాకే సొంతమంటూ...
                నీవు ఇక నా దానివంటూ...
చిన్ని పలుకులు చెరుపుకుంటూ
                మనసు మాత్రం మరువనంటూ...
కోటి అలలతొ పొంగిపోతూ
దరిన మాత్రం ఆగనంటూ...

నీ ప్రేమసాగరంలో
మునిగి తేలుకుంటూ...
మరణమైనా, శరణమైనా...
నాకు సర్వం నీవు అంటూ
నా మనసు నీకై పరితపిస్తోంది...

నా ఈ భావన
               తెలుసుకుంటావని,
నా మదికి బదులు అందిస్తావని కోరుకుంటూ

-
నీ ప్రేమికుడు 

Friday, June 15, 2012

నన్ను నిన్నని మరువమంటూ...


నీ మనసును తెలిపిన క్షణం 
                కన్నీరు కరువైంది...
నా కనులను తెరచిన క్షణం 
                నీ స్వప్నం మరుగైంది...
కొంటె చూపుల కాంతి పడగానే
కదిలే కాలం ఆగిపోయింది...
మనసు మాటల పిలుపు వినగానే
చూసే నయనం చిన్నబోయింది...

కనుల ఎదుట కదలమంటూ,
రేపటి సమయం తనతో గడపమంటూ...
చీకటి వెలుగుల కలతను తీర్చమంటూ,
కాలాన్ని కంటి చూపుతో కట్టివేయమంటూ...
లేని ఆశల ఊసు చూపి
                మరువలేని ఊహ రేపి 
మనసు మారిన చివరి క్షణం 
ప్రేమనేదే లేదు అంటూ
నన్ను నిన్నని మరువమంటూ...

మధురమైన మాటలతో
                చిన్ని చిలిపి కులుకులతో,
జీవితాన్నే కుదిపివేసే సూటిపోటి మాటలతో,
మనసు మారిందని
                ప్రేమ కరువైందని...
మది చూపిన మార్గం మార్పుకోరిందని
యదలో నీ రూపం తీర్పు అడిగిందని
నన్ను వీడిపోకు ప్రియతమా...
నన్నొంటరి చేయబోకుమా...


Thursday, June 14, 2012

నిన్ను చూసి ఆగాలనే నా శ్వాస...



కదిలిపోయే కాలం నాకై ఆగనంటోంది
కరిగిపోయే కలవు నువ్వని కొట్టివేస్తోంది
నా హ్రుదయ స్పందన నువ్వు
             నా కలల కానుక నువ్వు
నా ఊహల అల్లిక నువ్వు
             నా ఊపిరి ఆశ నీ నవ్వు

నా నిరంతర యోచన 
             నీ దరి చేరాలనే వేదన
నా అలుపు లేని ఈ సాధన
             నీతో తోడుకై ఆరాధన
కనులు రాసే కావ్యమేదో కాదు అంటోంది...
మనసు వేసే మెలిక మాత్రం రాను అంటోంది...

నా కనుల ఎదుట నాట్యమాడే 
ఈ చీకటి అంచులు 
నీ తలపుల వెలుగును తుంచివేస్తున్నాయి...
నాకు సమయం లేదు...
నీ తోడు లేదు...
నీకు నాపై కరుణ లేదు...
నన్ను చేరే తరుణం రాదు...
నా చివరి క్షణాల చివరి ఆశ
నిన్ను చూసి ఆగాలనే నా శ్వాస...
ఈ నిమిషమైనా నన్ను చేరుతావని 
నీకోసం ఎదురు చూస్తూ


-
నీ ప్రేమికుడు

Tuesday, June 12, 2012

కన్నీళ్ళే మిగిలాయి...


నిన్ను కలవక రోజులు గడిచాయి,
మనసు తెలుపక మాటలు మరిచాయి.
కనుల తడిలో తడవమంటూ, 
ఎగసి ఒడిలో ఇమడమంటూ...
జీవితాంతం తోడు అంటూ,
ఈ క్షణాన్నే వీడనంటూ...
యద పలికే చిరు పలుకులు తరిగాయి...

మౌన రాగం నీదనీ,
                  దూరమైతే కాననీ,
కరుణ కోరే చివరి సమయం, 
                  స్వప్నలోకం నీవనీ,
ముద్దుమాటలు మభ్యపెట్టే,
                  మధుర గానం నీదనీ,
కలను సైతం కాల్చివేస్తూ
ఇలను సైతం కూల్చివేస్తూ
మేము మాత్రం నిత్యమంటూ
నీ గురుతులు మిగిలాయి...

యదలోతుల నిదురించే
                  ఆ రూపం నీవనీ,
నీ పలుకుకు పులకించే
                  నా హ్రుదయం నీదనీ,
మది సైతం మరిపించే
                  నా అలజడి నీవనీ,
నా మనసును మురిపించే
                 చిరు సవ్వడి నీదనీ,
నీ స్వప్నం చూపిస్తూ
నిత్యం ఉంటామంటూ...
నా కనులను వీడకుండ
కన్నీళ్ళే మిగిలాయి...



Thursday, May 31, 2012

నా ప్రేమకు వరమిచ్చే దేవత...


మనసును మెప్పించే మౌనం నీ ప్రేమ,
కలలను రప్పించే కావ్యం నీ ప్రేమ... 
మది కోరిన తరుణంలో వరుణం నీ ప్రేమ,
ఎదలోతుల మురిపించే మక్కువ నీ ప్రేమ... 

అల్లరి ఆనందపు గెంతులతో,
                  చల్లని చిరుజల్లుల చిందులతో
కలలెరుగని కన్నులతో,
                  కలమెరుగని రాతలతో
మలుపెరుగని మార్గములో,
                  అలుపెరుగని ఆత్రముతో
నీ కనుచూపుల కరు్ణకై, తొలి చూపుల స్పర్శకై
నా మనసు నీకై ఎదురు చూస్తోంది...

నీ ప్రేమలో కాలం కమ్మగా కరిగిపోతోంది 
నయనం కలలకై కలవరిస్తోంది 
నా ఎదపై వాలే చిరు చినుకు నీ ప్రేమ...
నా మనసంతా పులకించే మల్లెలు నీ ప్రేమ...
నా కోసం తపియించే కోరిక నీ ప్రేమ...
నా ప్రేమకు వరమిచ్చే దేవత నీ ప్రేమ...

నా రాగం నీవు, అనురాగం నీవు...
నా స్నేహం నీవు,
                  నా కోసం నీవు...
నా బంధం, అనుబంధం, మకరందం నీవు 
నా ఆవేదన తరిగించే ఆనందం నీవు 
 నాతోనే నిత్యం ఉండే నా సర్వం నీవు,
సర్వస్వం నీవు...

Wednesday, May 30, 2012

 నీ స్వప్నాల రంగుల లోకం...


నీ కనుపాపల చిరు సవ్వడి నా నేస్తం..,
నీ చిరునవ్వుల మరుమల్లెలు నా కోసం.., 
ప్రశ్నలతో పరిక్ష పెట్టే ఆ ముఖారవిందం 
తానే జవాబై తికమక పెడుతోంది, 
మరిపించి మురిపించే ఆ వర్ఛస్సు 
తన మరపు కాదంటూ మభ్యపెడుతోంది...

ఆ వెన్నెల కోవెలవై,
                 మరుమల్లెల మాలికవై...
మురిపించే మాటలతో
                 చిరునవ్వుల చిందులతో...
కనుపాపల అలవోపగ కనిపించే దేవతవై
నాకోసం వస్తావని,
                 నన్నే కరుణిస్తావని
ఈ తొలకరి చిరుజల్లుల కనువిందుల తీరికలో 
నా కోరిక తీరుస్తావని,
                 నా ఆశలు ఆవిరి చేస్తావని... 
నాకు సర్దిచెప్పే నీ మనసు...

తొలి చూపుల మన ప్రణయం 
మెలకువ లో మొదలై
                 కలల్లో కొనసాగుతోంది...
నీ స్వప్నాల రంగుల లోకం
నను వాస్తవానికి దూరంగా
నిజానిజాల భేదాలను తెలిపే సన్నని రేఖపై
అల్లరి ఆనందపు అలలతో ముంచివేస్తోంది... 

మన కలయికలో యుగాలు క్షణాలై
మరుదూరాలలో క్షణాలు యుగాలై
నువ్వు నేను కలిసి చూసిన ఆనందపు అంచులు 
ఆజన్మాంతం ఉండాలంటున్నాయి... 
నీ నా దూరాలను తుంచాలంటున్నాయి... 
కలలోనైనా ఇల అంచులు దాటకంటున్నాయి... 
మురిపించే మరిపించే మనసులను 
                       కలిసిపొమ్మంటున్నాయి...