Wednesday, March 13, 2013

నీకై వేచి చూసే ఈ చిన్నా చిన్ని హ్రుదయం...


మర్చిపోను...
నీతో సాగిన ప్రయాణాన్ని,
మర్చిపోను...
నీతో పెట్టిన ముచ్చటలని,

నా హ్రుదయ స్పందన చేసే చప్పుడు...
నీ చిలిపి నవ్వులను గుర్తుచేస్తుంది.
నా కలల కెంపులు పెట్టే అలజడి...
నీ మెరుపు చూపులను గుర్తుచేస్తుంది.

అయినా నీ కోసం మౌనంగా ఉన్నాను...
నీతోనే మౌనంగా ఉన్నాను...

నాకు తెలుసు
ఎదో ఒక రోజు నా మౌనం కంచెలు దాటుతుందని.,
నీ కనుల ఎదుట వాలుతుందని.,

ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ
నీకోసం ఈ కవితలు రాస్తూ
నిన్ను మరువకుండా
నీ గురుతులను చెరపకుండా

-
నీకై వేచి చూసే
ఈ చిన్నా చిన్ని హ్రుదయం.

2 comments:

  1. నీటి కుండని చూసి నీరు ఉన్నాయి అని భ్రమపడినంత మాత్రాన అందులో నీరు ఉండచ్చు ఉండక పోవచ్చు...
    అలాగే మనిషిని చూసి ప్రేమిచ్చి స్వీకరించే మనసు ఉందని చెప్పాలంటే వాళ్ళ సాంగత్యం లోనే తెలుస్తుంది. ....

    ReplyDelete