ఇది నా మనవి నీతో
నను కలవమని
ఇదే నా మనవి నీతో
నను చేరుకొమ్మని
నా చిరు ఆశల పందిరి లో
మరుమల్లెల సందడిలో
ఆకాశం అడ్డు వచ్చినా
భూమి సైతం బెట్టు చేసినా
నిన్ను చేరక మానదు నా హ్రుదయం
నీ ప్రేమను పొందక మానదు ఈ తరుణం.
అందుకే మనవి చేసుకుంటున్నా ప్రియతమా..!!!
నా మనసు నిన్ను చేరే లోపు
నీ మనసు కరిగే లోపు
నా హ్రుదయ స్పందనని
నీ సువర్ణ హస్తాలతో
నశింపజేసి
నీవులేని ఈ జీవన నరకం నుండి బయట పడేస్తావని
నీ చేయి కోసం ఎదురు చూస్తూ ఉంటాను ప్రియతమా...
-
చిన్నా
No comments:
Post a Comment