నీవు నన్ను కాల్చివేసినా
నా మనసు కోటను కూల్చివేసినా
వెలుగునార్పి చీకటి నింపినా
నిన్ను వెతికే మదిని చిత్తు చేసినా
కాలానికి సైతం సవాలు వేస్తూ
నీకోసం ఆపుతానంటూ
నీ కదలికతో కదుపుతానంటూ
నా జీవిత సారం నీవని తెలిసి
నే కోరే గమ్యం నీ వలపని తెలిసి
మరలా నీకై, నీ తలపుకై
ఎదురుచూసే నా మనసుని
ఆగిపొమ్మంటూ...
నీకై కొంతకాలం ఇంకొంతకాలం
మదిని అణచుకొమ్మంటూ
నీవనే మాటల గారడి
పదే పదే గుర్తుకొస్తుంటే...
నీ చేయి పట్టుకుని
ఓ సుధీర్ఘ పయనానికి
నడుచుకుంటూ వెళ్ళాలనిపిస్తోంది...
మరు క్షణం నా చేయి ఒంటరిదని జ్ఞప్తికొస్తోంది...
నీ చేతి స్పర్శ లేక నా మనసు
నిర్వీర్యమైపోయింది...
ఈ ఒంటరి పయనానికి తోడునందిస్తావనీ,
జీవితాంతం నా చేతిని వదలకుంటావనీ,
ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ అనే నా ఆవేదన
తీరుస్తావని ఆశిస్తూ
నీపై తరగని ప్రేమతో...
-
నీ ప్రేమికుడు
బాగుంది...
ReplyDeleteKeep writing.
ధన్యవాదాలండీ...
ReplyDeleteచాలా బాగుంది
ReplyDeletethanq very much...
Delete