Monday, July 2, 2012

నీతో తెలిపే ధైర్యం లేదని...


కనులు మూసినా కనులు తెరచినా
కలతవై నువు ఎదురొస్తుంటే...
కనుల ఎదురుగా కనుమరుగయ్యే
మనసు మాట విననంటోంది...
మాటలలోని మధుర భావనే
మూగబాసయై మురిపిస్తుంటే...
మది కోరే తలపు నీవనీ
మనసు నీకై చని వస్తోంది...

జీవితమంతా నీతోనేనని
               నీతో తెలిపే ధైర్యం లేదని...
సమయం సహకిరిస్తే
               నీవు కలవనిస్తే...
నా తలపు తెలిపే తరుణం కోసం 

నీకై నా మది ఎదురుచూస్తోంది...

నిన్ను చూసిన ఆఖరి తరుణం
మదిని వీడి పోను అంటోంది...
నిన్ను వీడిన ఆ తొలి సమయం
మనసును సాంతం ముంచివేస్తోంది...

ఇది కవిత కాదనీ,
                నా మనసు మాటనీ...
ఇది నీ కోసమేననీ,
                నన్ను నీతో కలపాలనీ...
చీకటి తుంచిన చేతులతోనే
జీవితాంతం వెలుగు నింపమని
మురిసిపోయే మనసుతో,
కవ్వించే కులుకులతో,
జీవితమంతా నాతో ఉంటావని
మాటిస్తావని కోరుకుంటూ...

-
నీవై నిండిన మనసు 




8 comments: