Tuesday, June 12, 2012

కన్నీళ్ళే మిగిలాయి...


నిన్ను కలవక రోజులు గడిచాయి,
మనసు తెలుపక మాటలు మరిచాయి.
కనుల తడిలో తడవమంటూ, 
ఎగసి ఒడిలో ఇమడమంటూ...
జీవితాంతం తోడు అంటూ,
ఈ క్షణాన్నే వీడనంటూ...
యద పలికే చిరు పలుకులు తరిగాయి...

మౌన రాగం నీదనీ,
                  దూరమైతే కాననీ,
కరుణ కోరే చివరి సమయం, 
                  స్వప్నలోకం నీవనీ,
ముద్దుమాటలు మభ్యపెట్టే,
                  మధుర గానం నీదనీ,
కలను సైతం కాల్చివేస్తూ
ఇలను సైతం కూల్చివేస్తూ
మేము మాత్రం నిత్యమంటూ
నీ గురుతులు మిగిలాయి...

యదలోతుల నిదురించే
                  ఆ రూపం నీవనీ,
నీ పలుకుకు పులకించే
                  నా హ్రుదయం నీదనీ,
మది సైతం మరిపించే
                  నా అలజడి నీవనీ,
నా మనసును మురిపించే
                 చిరు సవ్వడి నీదనీ,
నీ స్వప్నం చూపిస్తూ
నిత్యం ఉంటామంటూ...
నా కనులను వీడకుండ
కన్నీళ్ళే మిగిలాయి...



4 comments: