Thursday, June 14, 2012

నిన్ను చూసి ఆగాలనే నా శ్వాస...



కదిలిపోయే కాలం నాకై ఆగనంటోంది
కరిగిపోయే కలవు నువ్వని కొట్టివేస్తోంది
నా హ్రుదయ స్పందన నువ్వు
             నా కలల కానుక నువ్వు
నా ఊహల అల్లిక నువ్వు
             నా ఊపిరి ఆశ నీ నవ్వు

నా నిరంతర యోచన 
             నీ దరి చేరాలనే వేదన
నా అలుపు లేని ఈ సాధన
             నీతో తోడుకై ఆరాధన
కనులు రాసే కావ్యమేదో కాదు అంటోంది...
మనసు వేసే మెలిక మాత్రం రాను అంటోంది...

నా కనుల ఎదుట నాట్యమాడే 
ఈ చీకటి అంచులు 
నీ తలపుల వెలుగును తుంచివేస్తున్నాయి...
నాకు సమయం లేదు...
నీ తోడు లేదు...
నీకు నాపై కరుణ లేదు...
నన్ను చేరే తరుణం రాదు...
నా చివరి క్షణాల చివరి ఆశ
నిన్ను చూసి ఆగాలనే నా శ్వాస...
ఈ నిమిషమైనా నన్ను చేరుతావని 
నీకోసం ఎదురు చూస్తూ


-
నీ ప్రేమికుడు

2 comments: