ఎన్ని రోజులు గడిచినా, ఎంత ప్రయత్నించినా
నా మనసు నీకై ఇంకా పరితపిస్తోంది...
నీ మదిని వీడలేనంటోంది,
మరులోకం చూడలేనంటొంది.
కనులు మూసిన క్షణం
నీ తలపు సైతం ప్రశ్న వేస్తోంది.
మనసు మారనంటూ
నిను వీడనంటూ
నీవు లేక ఉండలేనంటొంది.
నా మనసుకి సర్దిచెప్పలేకపోతున్నాను...
దాని తీరును మార్చలేకపోతున్నాను...
నీ తలపును తరమలేకపోతున్నాను...
నా కనులను తుడవలేకపోతున్నాను...
ఇంకెంత కాలం ఇలా అనీ
మది కుదుటపడే క్షణమేదనీ
ప్రశ్నల వర్షం నన్ను వరదలా మారి ముంచివేస్తోంది...
క్షణక్షణం నరకంలా కాల్చివేస్తోంది....
నా మదిని ఏమార్చిన నీవే
నా మనసుపడే వేదన తీరుస్తావనీ
నీ మదురమైన మాటలతో
తిరిగి నన్ను మునిపటిలా మారుస్తావనీ
నీ రాక కోసం నా మనసు ఎదురుచూస్తోంది...
నా శ్వాస నీకై నిలిచిపోతోంది.
No comments:
Post a Comment