Saturday, May 26, 2012

నా మనసు తెలిపే ఆఖరి సత్యం...


నీవే లోకమైన నాకు, ఏదో తెలియని ఆందోళన...
అది నీ చేరిక లేదనే ఊహల సమ్మేళన...
కనులు మూసిన క్షణం 
కలవై ఎదురు నిలిచి
మెలకువ మొదలయ్యే క్షణం
కన్నీరై కరిగిపోతున్నావు...

నా ఆరాటాల కలయిక 
              నా ఆనందాల మూలిక...
నను వేదించే వేడుక
              నను కవ్వించే కానుక...
అది నీవు నా దరిచేరుతావనే కోరిక 

నా కలం రాసే చివరి రాత
              నా శ్రుతిలయల చివరి పాట...
నా కనులు చూసే ఆఖరి రూపం 
              నా మనసు తెలిపే ఆఖరి సత్యం...
అది శాశ్వతంగా నీవు లేని లోకాన్ని విడిచే క్షణం

ఏళ్ళు గడచినా ఏమారని నా మనసు...
మరపు వచ్చినా మురిపించే మనసు...
కనులు మూసినా, కలత వచ్చినా
ఆ ఆవేదన ఆగదనీ...
నీవు లేక సాగదనీ...
నా చివరి శ్వాశ సైతం నీకేననీ...

-
నీవు విడచిన మనసు

7 comments:

  1. చాలా బాగుంది...

    ReplyDelete
  2. ధన్యవాదములండీ సాయిగారు...బ్లాగును తరచూ వీక్షించండి..

    ReplyDelete
  3. నా ఆరాటాల కలయిక
    నా ఆనందాల మూలిక...
    నను వేదించే వేడుక
    నను కవ్వించే కానుక...
    అది నీవు నా దరిచేరుతావనే కోరిక

    చాలా బాగుంది... nice lines

    ReplyDelete