Saturday, May 26, 2012

నీ నవ్వుల చిరుజల్లు...


నాలోని చిరు సవ్వడి నీ కోసం 
నాలోని మది సందడి నీ కోసం 
నీ నవ్వుల చిరుజల్లు 
                   నా మనసుని తాకిన క్షణం
ఒక కొత్త లో్కంలోకి వెళ్ళిన నా మనసు
నీవు లేని లోకానికి రానంటున్నది...

క్షణకాలం లో మనసు దోచి
                  మరుక్షణం మాయమై...
జన్మ నీతోనే అని మాటనిచ్చి 
                  అందని దూరాలకు చేరువై...

నీవు ఒంటరి చేసిన నా మనసు
తానొంటరి కాదంటూ...
నీ  జ్ఞాపకాలే తన తో్డంటూ...
నీవు విడచిన లో్కంలో
అలుపెరుగని ఆలోచనలతో,
ఊపిరి అడగని ఊహలతో,
నిరంతరం నీపై ఆశతో 
                   ఎదురుచూస్తున్నది...

నీ చేరిక నా జీవిత గమ్యం...
                   నా కోరిక నీతో బంధం...
మోడై మిగిలిన నా జీవితంలో
చిరుజల్లులు కురిపిస్తావని,
మరుమల్లెలు పూయిస్తావని,
నీకై నీ రాకకై ఎదురుచూస్తూ...

-
ఓ మనసు

5 comments:

  1. thanq very much...
    keep visiting & see all poetry...
    listed in blog archieve...

    ReplyDelete
  2. blogger settingslo comments settings lo Show word verification for comments? ane option untadi. ah options ni NO ga select cheste.. visitors ki comment pettataniki easy ga untadi...

    sorry if any hurtings or mistakes.....

    ReplyDelete
  3. ayyayyo indulo hurt ayyedemundi...
    actual ga "word verification" unna vishayam nenu chooskoledu...
    definately i'll minus it...
    thaks for the feed back kruthi gaaru...

    ReplyDelete