కన్నీరు కరువైంది...
నా కనులను తెరచిన క్షణం
నీ స్వప్నం మరుగైంది...
కొంటె చూపుల కాంతి పడగానే
కదిలే కాలం ఆగిపోయింది...
మనసు మాటల పిలుపు వినగానే
చూసే నయనం చిన్నబోయింది...
కనుల ఎదుట కదలమంటూ,
రేపటి సమయం తనతో గడపమంటూ...
చీకటి వెలుగుల కలతను తీర్చమంటూ,
కాలాన్ని కంటి చూపుతో కట్టివేయమంటూ...
లేని ఆశల ఊసు చూపి
మరువలేని ఊహ రేపి
మనసు మారిన చివరి క్షణం
ప్రేమనేదే లేదు అంటూ
నన్ను నిన్నని మరువమంటూ...
మధురమైన మాటలతో
చిన్ని చిలిపి కులుకులతో,
జీవితాన్నే కుదిపివేసే సూటిపోటి మాటలతో,
మనసు మారిందని
ప్రేమ కరువైందని...
మది చూపిన మార్గం మార్పుకోరిందని
యదలో నీ రూపం తీర్పు అడిగిందని
నన్ను వీడిపోకు ప్రియతమా...
నన్నొంటరి చేయబోకుమా...
నన్నొంటరి చేయబోకుమా...
baagundi.
ReplyDeletethnq padma garu....
Deletenice bhagundandi.
ReplyDeletethnQ andi...
Delete